Breaking News

సీతా రాముల కల్యాణానికి ముహూర్తం

Published on Tue, 02/07/2023 - 04:42

భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారాముల తిరుకల్యాణోత్సవం నిర్వహణకు ముహూర్తం నిశ్చయించారు. కాగా, 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కర పట్టాభిషేకం మార్చి 31న జరగనుండగా, బ్రహ్మోత్సవాలు, పట్టాభిషేక మహోత్సవం షెడ్యూల్‌ను వైదిక కమిటీ, ఆలయ ఈవో శివాజీ సోమవారం ప్రకటించారు. 

ఉగాది పర్వదినాన... 
మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, మార్చి 22 నుంచి మార్చి 31 వరకు పుష్కర పట్టాభిషేక ప్రయుక్త ద్వాదశ కుండాత్మక చతుర్వేద సహిత శ్రీరామాయణ మహాక్రతువు ఉత్సవాలను జరపనున్నారు. మార్చి 22న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పుష్కర పట్టాభిషేకం క్రతువుకు అంకురార్పణ జరగనుంది.

26న ఉత్సవమూర్తులకు విశేష స్నపనం, బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం, 27న గరుడ ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాధివాసం, 28న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, 29న ఎదుర్కోలు ఉత్సవం, గరుడ వాహన సేవలను జరుపుతారు. 30న శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవం, శ్రీరామపునర్వసు దీక్షా ప్రారంభం, చంద్రప్రభ వాహనసేవ, 31న పుష్కర పట్టాభిషేక మహోత్సవం, శ్రీరామాయణ మహాక్రతువు పూర్ణాహుతి, రథోత్సవం ఉంటాయి. ఏప్రిల్‌ 5న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ, శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు సమాప్తి కానున్నాయి. కాగా, బ్రహ్మోత్సవాల సమయాన రోజువారీ ప్రత్యేక పూజలు నిలిపివేయనున్నారు. 

ఈ ఏడాది పుష్కర పట్టాభిషేకం
 భద్రా చలం పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంతోపాటు మరుసటి రోజే జరిగే రామయ్య పట్టాభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. రాముడికి భద్రాచలంలో ప్రతీ 60 ఏళ్లకు ఒక్కసారి మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఈ పట్టాభిషేక మహోత్సవం భద్రాచలంలో 1927, 1987ల్లో జరగగా, మళ్లీ 2047లో మాత్రమే కళ్లారా చూసేందుకు అవకాశముంది. ఇది కాకుండా ప్రతీ 12 ఏళ్లకోసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరుపుతారు. 1999, 2011లో ఈ పుష్కర పట్టాభిషేకం నిర్వహించగా, ఈ ఏడాది మార్చి 31న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, వైదిక కమిటీ బాధ్యులు స్వామివారి వాహన సేవలకుగాను నూతన వాహనాలను తయారు చేయిస్తున్నారు. 

Videos

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ముగ్గురిలో ఎవరు..?

మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

అనకాపల్లి జిల్లా టీడీపీ మహానాడు సభ అట్టర్ ఫ్లాప్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

మళ్లీ అదే తీరు దక్షిణాఫ్రికా అధ్యక్షుడి రమఫొసాతో ట్రంప్ వాగ్వాదం

స్కామ్ స్టార్ బాబు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన YS జగన్ మోహన్ రెడ్డి

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)