Breaking News

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో సెలబ్రిటీలకు ఊరట?

Published on Mon, 03/24/2025 - 14:34

హైదరాబాద్‌, సాక్షి: ఇటు సినీ రంగ ప్రముఖులను, అటు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను హడలెత్తిస్తున్న బెట్టింగ్ యాప్స్ కేసులో ఇవాళ(మార్చి 24, సోమవారం) కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటిదాకా 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే వాళ్లందరికీ ఊరట కలిగించే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. 

తాజాగా ఈ కేసులో బెట్టింగ్‌ యాప్స్‌ ఓనర్లను పోలీసులు టార్గెట్‌ చేశారు. ఈ క్రమంలో ఇప్పటిదాకా 19 మందిపై కేసులు నమోదు చేశారు. కొత్త సెక్షన్లు చేర్చి మరీ వీళ్లందరినీ కేసుల్లో నిందితులుగా మార్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మియాపూర్‌ పోలీసులు కోర్టులో మెమో సైతం దాఖలు చేశారు. అయితే ఈ కేసులో ప్రముఖులను సాక్షులుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. 

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ చేసిన ప్రముఖులకు ఇప్పటికే చాలామంది నోటీసులు పంపించారు. కొందరిని విచారించగా.. మరికొందరిని విచారించాల్సి ఉంది. ఈ క్రమంలో యాప్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం.. ఛార్జ్ షీట్ లో సాక్షులుగా చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ప్రమేయం లేకుండా వాటిని ప్రమోట్‌ చేశామని, పర్యవసనాలకు ఊహించలేదని వివరణలు ఇస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బెట్టింగ్‌ యాప్‌ లావాదేవీలపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) ఫోకస్‌ చేసినట్లు సమాచారం.

బెట్టింగ్‌ యాప్స్‌ కేసు విచారణ దశలో ఉంది. ఈ కేసులో పోలీసుల విచారణకు సహకరిస్తా. ఇకపై బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయను
::పంజాగుట్ట పీఎస్‌లో విచారణ అనంతరం శ్యామల

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)