Breaking News

ఆడపులి కోసం అడవులన్నీ..

Published on Tue, 12/24/2024 - 01:08

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రాష్ట్రంలోని అడవుల్లో బెంగాల్‌ టైగర్‌ సంచారం కొనసాగుతోంది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఒకరిని చంపడంతోపాటు మరొకరిపై దాడి చేసిన పెద్దపులి.. తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం మీదుగా గోదావరి తీరం వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకొని అక్కడి నుంచి తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో తిష్టవేసింది. ఈ విషయాన్ని అటవీశాఖ ధ్రువీకరించింది. ‘తాడ్వాయి మండలం బందాల అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు ఆధారాలు దొరికాయి.

వారం క్రితం పంబాపురం, నర్సాపురం అడవుల్లో తిరిగిన పులి.. బందాల అడవుల్లో జంతువులను వేటాడిన ఆనవాళ్లున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’అని అటవీశాఖ రేంజ్‌ అధికారి సత్తయ్య హెచ్చరించారు. దీంతో గిరిజన గూడేల్లో మళ్లీ పులి కలకలం మొదలైంది. 
తోడు కోసం గాలిస్తూ..: ఇరవై రోజులకుపైగా అటవీ ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న మగ పులి.. ఆడపులి తోడు కోసం అడవులన్నీ తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పూర్వ ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌.. చెన్నూరు, భూపాలపల్లి, ములుగు జిల్లా తాడ్వాయి, మంగపేట, వాజేడు, వెంకటాపురం.. ఇంద్రావతి నుంచి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు అటవీ ప్రాంతం... ఇలా పులి సుమారు 10 జిల్లాల్లో చాలా దూరం నడిచినట్లు పాదముద్రల ద్వారా తెలుస్తోందని అటవీశాఖ ప్రకటించింది.

అయితే 2021లో ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్‌ రిజర్వ్‌ నుంచి ములుగు అడవులకు మేటింగ్‌ కోసం వచ్చిన పులే మరోసారి వచ్చి ఉంటుందని కూడా అధికారులు భావిస్తున్నారు. దీన్ని ధ్రువీకరించుకోవడానికి నాలుగైదేళ్ల నాటి పులుల సంచార రికార్డులు, కెమెరా ట్రాప్‌లు, వాటి ఫొటోలు పరిశీలించాల్సి ఉందంటున్నారు. ఆ తర్వాతే ఈ పులి ఎక్కడ నుంచి వచ్చిందన్నది కచ్చితంగా చెప్పగలమంటున్నారు. 

మూడేళ్ల కిందట ఇలాగే..: మూడేళ్ల క్రితం పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ములుగు, తాడ్వాయి, మంగపేట, కరకగూడెం, ఆళ్లపల్లి, రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి పర్యటించిందని అధికారులు పేర్కొన్నారు. అప్పట్లో ఒక ఆవును కూడా పులి చంపితిందని, ఆ తర్వాత నుంచి దాని జాడ లేదని.. తిరిగి 10 రోజులుగా పులి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూరు, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయిల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం వరకు పులి కారిడార్‌ను ఏర్పాటు చేసుకుందని అధికారులు అంటున్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)