Breaking News

కూతురుని ప్రేమించాడని.. ఇంటికి పిలిచి.?

Published on Thu, 12/11/2025 - 08:04

పటాన్‌చెరు టౌన్‌: ప్రేమ వ్యవహారం బీటెక్‌ బీటెక్ విద్యార్థిని బలి తీసుకుంది. మాట్లాడదామని ఇంటికి పిలిచి క్రికెట్‌ బ్యాట్‌తో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం సీఐ నరేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన శ్రావణ్‌ సాయి (19) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో పెదనాన్న వద్ద ఉంటున్నాడు.

పటాన్‌చెరు మైసమ్మగూడలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని సృజన లక్ష్మీసాయి మెడోస్‌లో ఉండే యువ‌తితో ఇతనికి పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. విషయం తెలియడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. అయినా వీరి వైఖరిలో మార్పు కనిపించలేదు. దీంతో పథకం ప్రకారం మాట్లాడేందుకంటూ మంగళవారం అమ్మాయితో ఫోన్‌ చేయించి ఇంటికి పిలిపించారు. 

మాటామాటా పెరిగి..
ప్రేమ విషయమై యువ‌తి తల్లి సిరి, సాయి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి కోపోద్రిక్తురాలైన సిరి క్రికెట్‌ బ్యాట్‌తో సాయిని, కూతురిని కొట్టింది. తల, వీపుపై బలంగా దెబ్బలు తగలడంతో సాయి స్పృహ కోల్పోయాడు. కుమార్తె చేయి విరిగింది. దీంతో తల్లి, సోదరుడు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. బుధవారం వేకువజామున ఇంటికి రాగా.. అప్పటికీ ఇంట్లోనే అపస్మారక స్థితిలో ఉన్న సాయిని చూసి వెంటనే నిజాంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. సాయి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.  

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)