Breaking News

తెలంగాణలో మద్యం ప్రియులకు బిగ్‌ షాక్‌!

Published on Wed, 01/21/2026 - 19:09

సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో మద్యం ప్రియులకు ఊహించని షాక్‌ తగలనుంది. ముఖ్యంగా వేసవిలో చల్లటి బీరు తాగి రిలాక్స్‌ అవుదామనే వారికి మాత్రం ఇది చేదు వార్తే. ఎందుకంటే.. వచ్చే వేసవి నాటికి రాష్ట్రంలో బీర్ల సరఫరా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం సింగూరు ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేయడమే. ప్రాజెక్ట్‌కు, బీర్లకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. అయితే.. ఇది తెలుసుకోండి.

సింగూరు డ్యామ్‌ సెఫ్టీ రివ్యూ ప్యానెల్‌ సూచనలు మేరకు ఈ వేసవిలో ప్రాజెక్ట్‌లోని నీటిని ఖాళీ చేసి అధికారులు మరమ్మతులు చేయనున్నారు. దీంతో, సంగారెడ్డిలోని నాలుగు ప్రధాన బెవరేజెస్‌ కంపెనీలకు సింగూరు నుంచే వెళ్లే నీటి సరఫరా ఆగిపోతుంది. నీటి వనరులు లేని కారణంగా బీర్ల కంపెనీలలో ఉత్పత్తి భారీగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సింగూరు జల మండలి నుంచి బీర్ల ఫ్యాక్టరీలకు రోజుకు 44 లక్ష లీటర్ల నీటి సరఫరా జరుగుతుంది. ఈ నేపథ్యంలో నీటి సరఫరా లేకపోతే ఉత్పత్తి నిలిచిపోనుంది. అలాగే, సిటీలో మంచి నీటి సరఫరాకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

మరోవైపు.. సంగారెడ్డి జిల్లాలోని ఫ్యాక్టరీల నుంచి 11 రాష్ట్రాలకు బీర్ల సరఫరా జరుగుతోంది. నామమాత్రపు ధరకే బీర్ల ఫ్యాక్టరీలకు నీటి సరఫరా అందిస్తున్నారు. ఇప్పుడు అధిక ఛార్జీలు వసూలు చేసి నీటి సరఫరా చేస్తే బీర్ల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే సమయంలో సింగూరు ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేస్తున్నా దృష్ట్యా ఫ్యాక్టరీలకు భారీ నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల నుంచి బీర్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. దీంతో, బీర్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న వేసవి దృష్ట్యా బీర్ల ఉత్పత్తి తగ్గరాదని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇందు కోసం తగిన ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. 

TS: మద్యం ప్రియులకు బిగ్ షాక్

 

Videos

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు