మోసపూరిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి : బెనకా గోల్డ్ ఎండి భరత్

Published on Mon, 01/06/2025 - 10:25

సాక్షి, హైదరాబాద్‌: బెనక గోల్డ్ పేరు చెప్పి కొంతమంది వ్యక్తులు తమ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ మోసగిస్తున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని వినియోగదారులు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వెనక గోల్డ్ ఎండి భరత్ కుమార్ కోరారు. జూబ్లీహిల్స్ లోని బెనక గోల్డ్ కార్పొరేట్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థలో గతంలో శివసాగర్, జగదీష్, మాణిక్ దాస్,  రవీంద్ర అనే నలుగురు పనిచేసేవారని, వారు పనిచేసే సమయంలో సంస్థతోపాటు వినియోగదారులను మోసగించడంతో వారిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని వారిపై కేసు కూడా నమోదయిందని తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కూడా సదరు వ్యక్తులు సంస్థ బ్రాండ్ ని ఉపయోగించుకొని కొంతమంది వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని సంస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని తెలిపారు. బెనక గోల్డ్ అనేది వినియోగదారులు తమ బంగారు ఆభరణాలను వివిధ సంస్థల్లో తాకట్టు పెడితే ఆ బంగారాన్ని విడిపించి వారికి నగదు చెల్లించే సంస్థ అని అన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమ సంస్థకు చెందిన 15కుపైగా బ్రాంచీలు ఉన్నాయని కావాలని కొంతమంది సంస్థ పేరును పాడు చేసేందుకు కుట్ర చేస్తున్నారని వారిపై త్వరలోనే నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా సంస్థ పేరు చెప్పి వినియోగదారులకు వద్దకు వస్తె అనుమానం కలిగితే సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 6366111999 కు కానీ, పోలీసులకు కానీ ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ లీగల్ అడ్వైజర్ మహమ్మద్ మోహిసిన్, రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్, భాస్కర్ రెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)