Breaking News

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి

Published on Fri, 02/14/2025 - 04:35

సాక్షి, హైదరాబాద్‌/కాచిగూడ: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉందని బీసీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్న వించారు. గురువారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్, కార్పొరేషన్‌ చైర్మన్లు నూతి శ్రీకాంత్‌ గౌడ్, ఈరవత్రి అనిల్, బీసీ సంఘాల నేతలు ఆర్‌.కృష్ణయ్య, జాజు ల శ్రీనివాస్‌ గౌడ్, మాజీ ఐఏఎస్‌ చిరంజీవులు, వినయ్‌ కుమార్, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణ మోహన్, దాసు సురేశ్‌ తదితరులు సమావేశమయ్యారు. 

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనని వారికి.. ఈ నెల 16 నుండి 28 తేదీల మధ్య అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. 

25న బెంగళూరులో ఓబీసీ జాతీయస్థాయి సదస్సు: కృష్ణయ్య
ఈ నెల 25న బెంగళూరులో ఓబీసీ జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని  ఆయన డిమాండ్‌ చేశారు. 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణతో కలిసి గురువారం కాచిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించడంపై కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)