Breaking News

బయ్యారం చెరువు.. చరిత్రకు సాక్ష‍్యం

Published on Wed, 07/02/2025 - 03:31

బయ్యారం: ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయరాజుల వంశవృక్షం.. ప్రస్తుత మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం పెద్దచెరువు కట్టపై లిఖించిన శిలాశాసనం ద్వారా అందుబాటులో ఉంది. పొడవాటిరాయిపై తెలుగు, కన్నడ, సంస్కృత లిపిలో ఉన్న కాకతీయరాజుల వంశవృక్షం, నాటి రాజుల పరిపాలనాదక్షతను తెలియజేస్తోంది.  

శాసనంలో ఏముందంటే.. 
వెన్నురాజు కాకతీయ రాజ్యాన్ని ఏలుతుండగా మొదటి గుండు, రెండో గుండు, మూడో గుండురాజులు జన్మించారు. వీరు రాజ్యాన్ని పాలించగా.. ఆ తర్వాత కుమారులు, మనుమలు, మనుమడి కుమారులు పాలన సాగించారు. వారి తర్వాత ఎర్రమరాజు కాకతీయ రాజ్యాన్ని పాలించగా.. ఆ తర్వాత పిండిగుండమ రాజు అనుమ, కొండ ప్రాంతాలను ఏలుతున్న రాజులను సంహరించి అనుమకొండ పేరున రాజధానిని ఏర్పాటు చేశాడు. అతనికి ప్రోలరాజు జన్మించాడు. అతను ప్రజల్లో దేవునిగా పేరు తెచ్చుకున్నాడు. 

ప్రోలరాజుకు త్రిభునవ మల్లరాజు జన్మించగా.. అతను శత్రువులు భయభ్రాంతులయ్యేలా పాలనను కొనసాగించాడు. త్రిభునవ మల్లరాజుకు రుద్రదేవుడు, మహాదేవుడు సంతానం. వీరిలో రుద్రదేవుడు శక్తిమంతుడు. మహదేవుడు దానధర్మాల్లో దేవేంద్రుడు. ఇతని భార్య బయ్యమాంబ.. శివునికి పార్వతిలా వ్యవహరించింది. వీరికి మైలమాంబ, గణపతిదేవుడు సంతానం. వీరిలో గణపతిదేవునికి 1105 సంవత్సరంలో కుమార్తె జన్మించింది. ఆమెకు శ్రీశైల మల్లికార్జునుడి పేరిట ధర్మకీర్తిగా ధర్మానికి ప్రతిగా పేరు పెట్టారు. 

మహదేవుడు తన కుమార్తె మైలమాంబకు తగిన సంబంధం చూడాలని మంత్రులను ఆదేశించాడు. మంత్రులు నటవాడి వంశీయుడైన రుద్రరాజును మైలమాంబకు తగిన వ్యక్తిగా ఎంపిక చేశారు. రుద్రదేవునికి మైలమాంబను ఇచ్చి వివాహం చేయగా.. వారు పార్వతీ పరమేశ్వరులుగా విలసిల్లారు.. ఇవీ శాసనంలో పేర్కొన్న వివరాలు. మైలమాంబ తన తల్లి బయ్యమాంబ పేరున ప్రజా క్షేమాన్ని కోరి జలనిధి (చెరువు)ని ఏర్పాటు చేసినట్లు ఈ శాసనం తెలుపుతోంది.

నీటి సామర్థ్యం 0.4 టీఎంసీలు.. 
కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్ద చెరువు 0.4 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉంది. రెండుగుట్టలను కట్టలుగా చేసుకొని నిర్మించిన చెరువుకట్ట 2.37 కిలోమీటర్ల మేర ఉండగా.. 987 ఎకరాల్లో నీరు నిల్వ ఉంటుంది. చెరువు పైభాగంలో సుమారు 100 కిలోమీటర్ల దూరంలో వర్షం కురిసినా.. చెరువులోకి పందిపంపుల, మసివాగుల ద్వారా వరద నీరు వస్తుంది. 

ఏటా రాష్ట్రంలో ఉన్న మీడియం ప్రాజెక్టుల్లో మొదట నీరు నిండి అలుగు పోసేది బయ్యారం పెద్ద చెరువుగా రికార్డులో ఉంది. చెరువు కింద 7,200 ఎకరాలు అధికారికంగా సాగవుతున్నట్లు తెలుపుతున్నప్పటికీ.. అనధికారికంగా మరో 7,200 ఎకరాల భూమి సాగవుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. 

నాడే గొలుసుకట్టుకు అంకురార్పణ.. 
కాకతీయుల కాలంలోనే.. ముందుచూపుతో వరద నీరు వృధాగా పోకుండా గొలుసుకట్టు చెరువులను నిర్మించారనడానికి బయ్యారం పెద్దచెరువే ఉదాహరణ. బయ్యారం పెద్దచెరువు నిండిన తరువాత అలుగునీరు వృధాగా పోకుండా.. అలుగునీటిపై కొత్తపేట సమీపంలోని కమలాయకట్టును నిర్మించారు. ఈ కట్టుద్వారా కాల్వను మళ్లించి గార్ల పెద్ద చెరువును నింపడంతో పాటు.. ఆ చెరువు అలుగు నీటిని పలు కుంటలకు సరఫరా చేశారు. కాకతీయరాజులు గొలుసుకట్టు చెరువుల ద్వారా భూములకు సాగు        నీరందించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)