Breaking News

తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ సాధ్యం కాదు

Published on Sun, 08/18/2024 - 04:39

సాక్షి, హైదరాబాద్‌: తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ నిర్మాణం సాంకేతికంగా సాధ్యం కాదని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ వి.ప్రకాశ్‌ తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను తుమ్మిడిహెట్టి కోణంలో కాకుండా మూడు తరాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికే ప్రాజెక్టును కేసీఆర్‌ రీడిజైన్‌ చేశారనే కోణంలో నిర్వహించాలని కోరారు. జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఎదుట శనివారం ఆయన స్వచ్ఛందంగా హాజరై తన వాదనలను వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బరాజ్‌ కడితే 5 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకోవచ్చని, అయితే మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తుతో కట్టడానికి మాత్రమే అంగీకారం తెలపడంతో 1.8 టీఎంసీలకు మించి నిల్వ చేసుకోవడానికి వీలు ఉండదని ప్రకాశ్‌ చెప్పారు. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటే అందులో ఎగువ రాష్ట్రాలు వాడుకోని 63 టీఎంసీలూ ఉన్నాయన్నారు. ఈ విషయంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ కమిషన్‌ను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. 

‘వీ’ఆకృతిలో బరాజ్‌ ఎక్కడా లేదు 
తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిస్తే వార్దా–వెన్‌గంగా నదులు కలిసే చోట ‘వీ’ఆకృతిలో బరాజ్‌ వస్తుందని, ప్రపంచంలో ఎక్కడా ‘వీ’ఆకృతిలో బరాజ్‌ లేదని స్పష్టం చేశారు. ప్రతిపాదిత స్థలంలో చాప్రాల్‌ వైల్డ్‌ లైఫ్‌ ప్రాంతం ఉందని, రూ.7,500 కోట్లు వెచ్చించినా తుమ్మిడిహెట్టితో ఆశించిన ప్రయోజనం ఉండదని చెప్పారు. 

నిజాం హయాంలో తెలంగాణ ప్రాంతంలో 9 ప్రాజెక్టులు ప్రతిపాదించగా, అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి చొరవతో అందులో సాగర్, శ్రీరాంసాగర్‌లను మాత్రమే నిర్మాణం చేపట్టారని, అవి కూడా అసంపూర్తిగా కట్టారని తెలిపారు. 57 ఏళ్లలో తెలంగాణ నాశనం అయిందని, ఈ కారణంగానే జలయజ్ఞం ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేసి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టినట్టు వివరించారు. కాగా బరాజ్‌ కుంగడానికి కారణాలను తెలుపుతూ ఈ నెల 26లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని కమిషన్‌ ఆదేశించగా 28న సాక్ష్యాధారాలతో సహా నివేదిక ఇస్తానని ప్రకాశ్‌ వెల్లడించారు.  

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)