Breaking News

లోన్ కట్టలేదని ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు

Published on Thu, 02/13/2025 - 10:58

కొడకండ్ల (జనగాం): తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంక్‌ అధికారులు(Bank Officials) ఓ కుటుంబాన్ని నిలదీసిన ఘటన బుధవారం ఏడునూతన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఐదుగురు మహిళల చొప్పున మూడు గ్రూపులకు 2021సంవత్సరంలో విజయ డెయిరీ(Vijaya Dairy) ఆధ్వర్యంలో డీసీసీబీ స్టేషన్‌ఘన్‌పూర్‌ బ్రాంచ్‌ ద్వారా గేదెల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.87వేల చొప్పున రుణం అందించారు. ఈఎంఐ రూ.4వేల చొప్పున కొన్ని నెలల పాటు మహిళలు చెల్లించారు.

 అనంతరం గేదెలు పాలు ఇవ్వకపోవడంతో మహిళలకు ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐలు చెల్లించలేదు. దీంతో బ్యాంక్‌ అధికారులు డిఫాల్టర్‌లకు నోటీసు ఇచ్చి రికవరీ ప్రయత్నాలు చేయగా కొందరు రుణం చెల్లించారు. తాజాగా బుధవారం డీసీసీబీ స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల బ్రాంచ్‌ మేనేజర్లు మహబూబీ, కల్యాణిలతో పాటు ఫీల్డ్‌ ఆఫీసర్లు మరోసారి రుణం బాకీ ఉన్న వారి ఇంటికి వెళ్లి నోటీసులిచ్చి రుణం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు. 

ఇందులో మద్దెబోయిన కళమ్మ, కుటుంబసభ్యులు రుణం కట్టడం ఇబ్బందిగా ఉందని తెలిపి ఇంటి గేట్లు తీసుకెళ్లమని బ్యాంక్‌ అధికారులు తీసుకొచ్చిన ట్రాక్టర్‌ డబ్బాలో వేయడంతో వారు తీసుకెళ్లారు. ఈ సంఘటన సామాజిక మాద్యమాల్లో వైరల్‌ కాగా బ్యాంక్‌ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని తెలుపుతున్నారు.

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)