Breaking News

పప్పుచారులో పాముపిల్ల

Published on Sat, 07/22/2023 - 02:51

కుషాయిగూడ(హైదరాబాద్‌): ప్రతిరోజూ వేలాదిమంది ఉద్యోగులకు మధ్యాహ్న భోజనం అందించే ఓ ప్రసిద్ధ కంపెనీ క్యాంటీన్‌ ఆహారపదార్థాల్లో పాముపిల్ల బయటపడింది. ఈ ఘటనతో ఉద్యోగులు ఒక్కసారిగా హడలిపోయారు. కుషాయిగూడలోని ఈసీఐఎల్‌ సెంట్రల్‌ క్యాంటీన్‌లో వండిన ఆహారపదార్థాలను చర్లపల్లి­లోని ఈవీఎం సంస్థకు మధ్యా­హ్న భోజనం నిమిత్తం ప్రతి­రోజూ తరలిస్తుంటారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఈవీఎం క్యాంటీన్లో సిబ్బంది ఆహార పదార్థాలను ఉద్యోగులకు అందించే సమయంలో పప్పుచా­రులో నుంచి ఓ పాముపిల్ల బయటపడింది.

అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా యజమాన్యం, సిబ్బంది జాగ్రత్త పడ్డారు. భోజనాల అనంతరం విషయం తెలుసుకుని ఉద్యో­గులు భయకంపితులయ్యా­రు. కొంతమంది ఉద్యోగులు సంబంధిత క్యాంటీన్‌ సిబ్బందిపై మండిపడ్డారు. గతంలో కూడా ఈ క్యాంటీన్‌ ఆహారపదార్థాల్లో పలు­మార్లు ఎలుకలు, బీడీలు, సిగరె­ట్లు వెలుగు చూశాయని ఆగ్ర­హం వ్యక్తం చేశారు. వేలాది మందికి భోజనం అందించే ఈసీఐ­ఎల్‌ క్యాంటీన్‌ నిర్లక్ష్యంపై స్పందించి, బాధ్యులను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కంపెనీ యాజమాన్యంపై కూడా ఫు­డ్‌ ఇన్‌స్పెక్టర్లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)