Breaking News

పోలియో చుక్కలు వేయగానే శిశువు మృతి

Published on Mon, 10/13/2025 - 05:42

కంగ్టి/నారాయణఖేడ్‌: పోలియో చుక్కలు వేసిన వెంటనే మూడు నెలల మగ శిశువు మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరాలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సర్కున్‌దొడ్డి స్వర్ణలత–ఉమేశ్‌ దంపతులకు మూడు నెలల క్రితం బాబు జన్మించాడు. పోలియో చుక్కలు వేయించేందుకు వీరి నలుగురి పిల్లలను ఆదివారం పల్స్‌ పోలియో కేంద్రానికి తీసుకొచ్చారు. ముగ్గురు ఆడపిల్లలకు పోలియో చుక్కలు వేసిన తర్వాత, మూడు నెలల శిశువుకు కూడా డ్రాప్స్‌ వేశారు. చుక్కలు వేసినప్పటి నుంచి శిశువు ఏకధాటిగా ఏడుస్తుండటంతో తల్లి స్వర్ణలత పాలు తాగించే ప్రయత్నం చేసింది.

పాలు తాగుతున్న సమయంలోనే శిశువు మృతి చెందింది. దీంతో పోలియో చుక్కల కారణంగా తమ బిడ్డ చనిపోయాడని స్వర్ణలత ఆరో పిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శిశువు మృతదేహాన్ని ఖేడ్‌ ఆస్పత్రికి తరలించారు. శిశువు మృతిపై డీఎంహెచ్‌ఓ నాగనిర్మలను ‘సాక్షి’ వివరణ కోరగా... శిశువు ఏడుస్తుండగా తల్లి పాలు తాగించడంతో ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్లి మృతి చెందే అవకాశాలున్నాయని చెప్పారు. 

పోలియో చుక్కలు కారణం కాదు 
శిశువు మృతికి పోలియో చుక్కలు కారణం కాదని ఖేడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తాను వైద్యులు, వైద్యాధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్టు చెప్పారు. ఒకే వాయిల్‌లోని చుక్కలను వేయించుకున్న ఇతర చిన్నారులెవరికీ ఏమీ కాలేదన్నారు.

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)