Breaking News

అయ్యప్పా.. ఒకటే ట్రిప్పా?

Published on Thu, 12/04/2025 - 10:40

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: ఉమ్మడి జిల్లా అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైలు విషయంలో తీవ్ర నిరాశ ఎదురవుతోంది. నాందేడ్‌ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైలు ఒక ట్రిప్‌ అది కూడా దిగువమార్గంలో వయా కరీంనగర్‌– పెద్దపల్లి మార్గంలో ఏటా నడిపిస్తున్నారు. ఈ రైలు ఉమ్మడి జిల్లాలోని అయ్యప్ప స్వాములకు, భక్తులకు సరిపోవడం లేదు. ముఖ్యంగా మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట నుంచి శబరిమలకి వెళ్లే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం ఈ నెల మొత్తం, వచ్చే నెల 15 (సంక్రాంతి) మకరజ్యోతి వరకు శబరిమల సన్నిధానం తెరచి ఉంటుంది. 

ఈ మాసంలో ఉమ్మడి జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు, అయ్యప్ప మాలధారులు శబరిమల దర్శనానికి వెళ్తుంటారు. వీరికి అందుబాటులో ఉండేది రైలుమార్గమే. ఇందుకు తగినన్ని రైళ్లు మన ఉమ్మడి జిల్లా నుంచి లేవు. రామగుండంలో ప్రతి రోజు నిలిచే 12626 కేరళ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండు నెలల ముందు రిజర్వేషన్‌ చేసుకున్న కూడా కన్ఫర్మ్‌ కానీ పరిస్థితి ఉంటుంది. ఇది దేశంలో అత్యంత దూరం నడిచే రైళ్లలో ఒకటి. 16318 హిమసాగర్‌ వీక్లీ ఎక్స్‌ ప్రెస్, 22647 కోర్బా బై వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

ఈ సమయంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల నుంచి కొల్లాం లేక కొట్టాయం వరకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలోని కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, విశాఖపట్నం, చర్లపల్లి, కాజీపేట, వికారాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్‌ మార్గాల్లో 10 ట్రిప్పులు ఎగువ, దిగువ మార్గాల్లో నడిపిస్తుంటే, కరీంనగర్‌ నుంచి యేటా తూతూ మంత్రంగా ఒకట్రిప్‌ వేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి ఒక ట్రిప్‌ కూడా వెళ్లడం లేదు. ఈ నిర్లక్ష్య వైఖరిపై శబరిమల వెళ్లే ఉమ్మడి జిల్లాలోని అయ్యప్ప భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ముగ్గురు ఎంపీలు చొరవ తీసుకోవాలి
ఏటా వేలాదిమంది భక్తులు ఉమ్మడి జిల్లా నుంచి శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో నాందేడ్‌ నుండి కొల్లాం శబరిమల  ప్రత్యేక రైలులో దిగువ మార్గంలోనే అవకాశం కల్పించడంపై భక్తులు మండిపడుతున్నారు. తక్షణమే కరీంనగర్‌ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవ తీసుకొని నాందేడ్‌ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైళ్ల సర్వీసులను కనీసం ఎగువతోపాటు దిగువ మార్గాల్లో మొత్తంగా  8 ట్రిప్పులు నడపాలని ఈ ప్రాంత భక్తులు కోరుతున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)