Breaking News

ఈసారి ఇద్దరే!

Published on Wed, 02/12/2025 - 03:29

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్‌)–2025 తొలి సెషన్‌ పరీక్షలో రాజస్తాన్‌కు చెందిన ఆయూస్‌ సింఘాల్‌ జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచాడు. ఈ పరీక్షలో ఈసారి తెలుగు విద్యార్థులు పూర్తిగా వెనుకబడ్డారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో తొలి 14 స్థానాల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మాత్రమే స్థానం సంపాదించారు. 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ 12వ స్థానంలో నిలవగా, తెలంగాణకు చెందిన బని బ్రాత మజీకి 14వ స్థానం దక్కింది. గత ఏడాది జేఈఈ మెయిన్‌లో తొలి 14 స్థానాల్లో 5, 6, 7, 8, 12, 13, 14 ర్యాంకులు తెలుగు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. 

జేఈఈ మెయిన్‌–2025 తొలి సెషన్‌ పరీక్షలో కర్ణాటకకు చెందిన కుషార్గా గుప్తా ద్వితీయ స్థానం, ఢిల్లీకి చెందిన దక్ష, హరీస్‌ ఝా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. మొదటి 14 ర్యాంకుల్లో ఎక్కువగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ విద్యార్థులే ఉన్నారు. 

ఇద్దరు తెలుగువారికే వంద పర్సంటైల్‌
ఈసారి జేఈఈ మెయిన్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మాత్రమే వంద పర్సంటైల్‌ సాధించారు. 99 స్కోర్‌ జాబితాలో తెలుగు పేర్లే లేవు. జనవరి 22 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్‌ –2025 తొలి సెషన్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

ఈ పరీక్షకు 13,11,544 మంది రిజిస్టర్‌ చేసుకోగా, 12,58,136 (95.93 శాతం) మంది పరీక్ష రాశారు. జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోటిపల్లి యశ్వంత్‌ సాత్విక్‌ 99 స్కోర్‌తో టాపర్‌గా నిలిచారు. మహిళా విభాగంలో సాయి మనోజ్ఞ గుత్తికొండ టాపర్‌గా నిలిచారు. ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్స్‌ రెండో సెషన్‌ జరుగుతాయి. రెండు విభాగాలను ప్రామాణికంగా తీసుకుని తుది ర్యాంకులు ప్రకటిస్తారు.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు