Breaking News

భూభారతి మాకు ఎన్నికల రెఫరెండమే!

Published on Tue, 06/10/2025 - 04:30

మిర్యాలగూడ: భూభారతి చట్టం దేశానికే రోల్‌ మోడల్‌ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన మంజూరు పత్రాలు అందజేశారు. భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

రాబోయే ఎన్నికల్లో భూభారతి చట్టం కాంగ్రెస్‌ పార్టీకి రెఫరెండం లాంటిదని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 22 మండలాల్లో 22 రెవెన్యూ గ్రామాలను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకొని భూ సమస్యలు పరిష్కరించామని చెప్పారు. రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరిస్తున్న దరఖాస్తులను ఆగస్టు 15 లోపు పరిష్కరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో ధరణి ద్వారా వచ్చిన 9.26 లక్షల దరఖాస్తులను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. 6 వేల మంది సర్వేయర్లను, 10,956 మంది వీఆర్‌వో, వీఆర్‌ఏలను త్వరలోనే నియమిస్తామని వెల్లడించారు.

వేగంగా నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తకుమార్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను, లిఫ్టులను పూర్తిచేసి తీరుతామని చెప్పారు. సాగర్‌ ఎడమకాల్వ మరమ్మతులకు రూ.67 కోట్లతో ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు డబ్బు రూ.15,181 కోట్లను 12 లక్షల మంది రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రోడ్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్, సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌అమిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)