Breaking News

అటో పర్మిట్‌ ఇక అన్‌లైన్‌లో..

Published on Tue, 06/17/2025 - 11:01

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త ఆటో పర్మిట్‌లకు ఇక ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం రవాణాశాఖ వెబ్‌సైట్‌లో అవకాశం కల్పిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను పరిశీలించి అన్ని విధాలుగా అర్హతలు కలిగిన ఆటోడ్రైవర్‌లకు  ప్రొసీడింగ్స్‌ (అనుమతులు) ఇస్తారు. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఎక్కడైనా ఆటోరిక్షా కొనుగోలు చేసుకోవచ్చు. పర్మిట్‌లపైన ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా, బ్లాక్‌ దందాకు అవకాశం లేకుండా పారదర్శకమైన విధివిధానాలను రూపొందించేందుకు  రవాణాశాఖ దృష్టి సారించింది. 

గతంలో కొంతమంది  డీలర్లు, ఫైనాన్షియర్‌లు కలిసి పెద్దఎత్తున దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బినామీ పేర్లపైన ఆర్టీఏ నుంచి అనుమతులు తీసుకొని పరి్మట్‌లను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆటోరిక్షాలపైన కృత్రిమ కొరతను  సృష్టించి  ధరలు పెంచారు. అప్పట్లో కొందరు రవాణా అధికారులు సైతం  ఇందుకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫైనాన్షియర్‌లు  నిరుపేద ఆటోడ్రైవర్‌లపైన నిలువుదోపిడీకి పాల్పడ్డారు. అప్పటి పరిణామాలు మరోసారి పునరావృతం కాకుండా అరికట్టేందుకు ఈసారి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో కేవలం హైదరాబాద్‌లోనే కొనుగోలు చేయాలనే నిబంధన ఉండేది. 

దీంతో  కొనుగోలుదార్లు డీలర్ల  డిమాండ్‌ మేరకు  ఆటోధర కంటే రెట్టింపు ధర చెల్లించవలసి వచ్చింది. ఈసారి  తెలంగాణలో ఎక్కడైనా సరే కొనుక్కొనేందుకు అవకాశం కల్పించడం వల్ల షోరూమ్‌ ధరలకే ఆటోలు లభించే అవకాశం ఉంటుంది. ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు  65 వేల కొత్త ఆటో పరి్మట్‌లకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త పర్మిట్‌లపైన ఆంక్షలను సడలించారు. ఈ ఆటోల్లో  25 వేల వరకు పెట్రోల్, డీజిల్‌ నుంచి ఎల్పీజీ, సీఎన్జీలోకి మార్చుకొనేందుకు రిట్రోఫిట్‌మెంట్‌కు అవకాశం కలి్పస్తారు. మరో 20 వేల ఎలక్ట్రిక్‌ ఆటోలు, 10 వేల ఎల్పీజీ, మరో 10 వేల సీఎన్జీ  ఆటోలకు పరి్మట్‌లు ఇవ్వనున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లో సుమా రు 1.4 లక్షల ఆటోలు తిరుగుతున్నాయి. కొత్త పరి్మట్‌ల వల్ల  ఆటోల సంఖ్య 2 లక్షలు దాటనుంది.  

గ్రేటర్‌ నివాసి అయితే చాలు... 
కొత్తగా ఆటోలు కొనుగోలు చేసేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లు ఆధార్‌ వంటి ధృవపత్రాలను కలిగి ఉండాలి. ఇంటి చిరునామా, వివరాలను అధికారులకు అందజేయాలి. అలాగే  త్రీవీలర్‌ ఆటోడ్రైవింగ్‌ లైసెన్స్, లైట్‌మోటార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉన్న వాళ్లకు మాత్రమే ఆటో కొనుగోలు చేసేందుకు అనుమతినిస్తారు. ఒక డ్రైవర్‌కు ఒక్క ఆటోకు మాత్రమే పర్మిషన్‌ ఇచ్చేవిధంగా నిబంధనలను కఠినతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఒకే డ్రైవింగ్‌ లైసెన్స్, ఒకే చిరునామాపైన పదుల సంఖ్యలో పరి్మట్‌లను పొందిన కొందరు వాటిని అధికధరలకు విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. ఈసారి  అలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా పటిష్టమైన నియంత్రణ చర్యలు తీసుకోనున్నట్లు ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ  మేరకు కొత్త ఆటోపరి్మట్‌లపై విధివిధానాలను రూపొందించేందుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ జేటీసీ రమేష్‌ నేతృత్వంలో అధికారుల సమావేశం జరిగింది. పరి్మట్‌లను పారదర్శకంగా ఇచ్చేందుకు తీసుకోవలసిన  చర్యలపైన  విస్తృతంగా చర్చించారు. ఆటో పర్మిట్‌లపై విధివిధానాలపైన త్వరలో రవాణాకమిషనర్‌ నిర్ణయం తీసుకోనున్నారు.

ఫైనాన్షియర్‌ల పరి్మట్‌ దందా.... 
నగరంలో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని భూరేలాల్‌ కమిటీ సిఫార్సుల మేరకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆటోలపైన ఆంక్షలు విధించింది. అదే సమయంలో కాలం చెల్లిన ఆటోల పరి్మట్‌లపైన కొత్తవి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో కొందరు ఆటోమొబైల్‌ డీలర్లు, ఫైనాన్షియర్లు పాత పపర్మిట్‌లను తమ గుప్పిట్లో పెట్టుకొని అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ఆటో రిక్షా ధరతో సంబంధం లేకుండా కేవలం పాతపర్మిట్‌ను రూ.50 వేల చొప్పున విక్రయిస్తున్నారు. దశాబ్దాలుగా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గతంలో రెండుసార్లు ఆంక్షలను సడలించి సుమారు 25 వేల వరకు కొత్త పర్మిట్‌లను ఇచ్చారు. ఈ కొత్తవాటిని సైతం ఫైనాన్షియర్‌లే బినామీ పేర్లపైన కొట్టేసి రూ.కోట్లు ఆర్జించారు. ఈ సారి ప్రభుత్వం 65 వేల ఆటోలకు అనుమతినిచి్చంది.

ఆర్టీఏ నిఘా అవసరం..
ఈసారి పర్మిట్‌ల కోసం పటిష్టమైన విధివిధానాలను రూపొందించడమే కాకుండా వాటి అమలుపైన నిఘాను ఏర్పాటు చేయడం అవసం. రవాణాశాఖ కేవలం గైడ్‌లైన్స్‌ రూపొందించడం వరకే పరిమితమైతే ఏకంగా 65 వేల ఆటోపరి్మట్‌లు  అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తాయి. దాంతో యథావిధిగా మరోసారి ఫైనాన్షియర్లు, డీలర్లు కలిసి బ్లాక్‌ దందా కొనసాగించే అవకాశం ఉంది.  

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)