Breaking News

ఏటీఎంలో రూ.18.99 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు

Published on Tue, 04/16/2024 - 08:22

శంషాబాద్‌ రూరల్‌: గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలో చొరబడి భారీగా నగదు దోచుకెళ్లారు. అర్థరాత్రి సమయంలో ఏటీఎంలోకి వెళ్లి సీసీ కెమెరాల్లో కనిపించకుండా వాటిపై నల్లరంగు స్ప్రే చేసి..ఆధారాలు లేకుండా తప్పించుకున్నారు. మరోచోట ఏటీఎంలోకి చొరబడేందుకు యతి్నంచి విఫలమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని పాల్మాకుల బస్టాప్‌ వద్ద బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఎస్‌బీఐ ఏటీఎం ఉంది. ఈ నెల 14న సీఎంఎస్‌ కంపెనీ వారు ఈ ఏటీఎంలో రూ.21 లక్షలు జమ చేశారు. ఆదివారం అర్థరాత్రి 1.59 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ముసుగు వేసుకుని వచ్చి..మొదట ఏటీంలోని  సీసీ కెమెరాలపై నల్లరంగు స్ప్రే చేశారు. అనంతరం గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంను కట్‌చేసి అందులో ఉన్న నగదు రూ.18,99,000 దోచుకున్నారు. 

పోలీసులకు సమాచారం.. 
ఏటీఎంలో దుండగులు గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేస్తుండగా..చివరి సమయంలో అక్కడ ఉన్న సేఫ్టీ పరికరాల ద్వారా ముంబయిలోని నిర్వహణ సంస్థకు అలర్ట్‌ వెళ్లింది. దీంతో సంస్థ ప్రతినిధులు సుమారు 20 నిమిషాల తర్వాత శంషాబాద్‌ ఎస్‌హెచ్‌ఓకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లే సరికి దుండగులు నగదుతో పారిపోయారు. ఏటీఎంలోకి చొరబడిన దుండగులు షటర్‌ను మూసివేసి లోపల పని కానిచ్చారు. దీంతో అటువైపు పెద్దగా ఎవరి దృష్టి పడలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే వరకు స్థానికులకు సమాచారం లేదు. ఏటీఎం కేంద్రాన్ని డీసీపీ నారాయణరెడ్డి, సీఐ నరేందర్‌రెడ్డి పరిశీలించారు. క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

శంషాబాద్‌ పట్టణంలో.. 
శంషాబాద్‌ పట్టణంలో ఆర్జీఐఏ పోలీస్‌ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఏటీఏంలోనూ చోరీకి దుండగులు యతి్నంచి విఫలమయ్యారు. ఇక్కడ ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో నగదు దోచుకునేందుకు దొంగలు ప్రయతి్నంచినట్లు పోలీసులు గుర్తించారు. కానీ ఎలాంటి నగదు చోరీకి గురికాలేదు. 
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)