Breaking News

ప్లీజ్‌ నన్ను కాపాడండి.. అశ్వారావుపేట యువతి ఆవేదన

Published on Fri, 07/25/2025 - 08:00

అశ్వారావుపేట రూరల్‌: ఆర్థిక సమస్యలతో మస్కట్‌కు వెళ్లిన ఓ యువతి అక్కడ ఇబ్బంది పడుతున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన కావ్య డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేసింది. ఈ క్రమంలో ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలానికి చెందిన ఓ మహిళతో కావ్యకు పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో తన ఆర్థిక ఇబ్బందులు, తల్లి మేరీ అనారోగ్య సమస్యల గురించి ఆ మహిళకు చెప్పగా.. మస్కట్‌లో తనకు తెలిసిన ఓ సేఠ్‌ ఇంటికి పంపిస్తానని, భార్యాభర్తలు మాత్రమే ఉండే వారి ఇంట్లో పని చేస్తే నెలకు రూ.30 వేల నుంచి 40 వేల వరకు వస్తాయని ఆశ కల్పించింది. మస్కట్‌కు వెళ్లేందుకు రూ.3 లక్షలు ఖర్చవుతాయని, అవి తానే భరిస్తానని చెప్పింది. దీంతో మూడు నెలల క్రితం కావ్య మస్కట్‌కు వెళ్లింది.  

కామెర్లు, అనారోగ్య సమస్యలు.. 
మస్కట్‌లో తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని, ఒక ఇంట్లో అని చెప్పి మూడు అంతస్తుల్లో ఏడు కుటుంబాల వారు పని చేయించుకుంటున్నారని, అంతా కలిపి రూ.15 వేలు మాత్రమే ఇస్తున్నారని రోదిస్తూ కావ్య సెల్ఫీ వీడియోను తన తల్లికి పంపించింది. ప్రస్తుతం తాను కామెర్లతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నానని, కనీసం వైద్యం కూడా చేయించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా తనను అశ్వారావుపేటకు తీసుకొచ్చేలా చూడాలని అధికారులు, ప్రభుత్వాన్ని వేడుకుంది. తనను మోసం చేసిన ఏపీకి చెందిన మహిళా ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, తన కూతురును మోసం చేసి మస్కట్‌కు పంపించిన మహిళా ఏజెంట్‌పై ఏపీలోని తాళ్లపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కావ్య తల్లి వెల్లడించారు. తన కూతురును త్వరగా ఇంటికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.  


 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)