Breaking News

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

Published on Sun, 08/24/2025 - 05:06

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రారంభించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై అక్టోబర్‌ 31లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్‌కు సూచించిన సంగతి విది­తమే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నోటీసుల జారీ ప్రక్రియను స్పీ­కర్‌ ప్రారంభించారు. నోటీసులు అందుకున్న వారు నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వా­లని పేర్కొన్నట్లు తెలిసింది. 

ఇప్పటివరకు ఐదు­గురు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల), ప్రకాశ్‌గౌడ్‌ (రాజేంద్రనగర్‌), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌­చెరు), తెల్లం వెంకటరావు (భద్రాచలం)కు స్పీకర్‌ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయినట్లు తె­లి­సింది. తనకు నోటీసులు వచి్చన విష­యం వాస్త­వమేనని కృష్ణమోహన్‌రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. అయితే హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన చిరునామాకు నోటీసులు వచ్చాయని, తాను గద్వాలలో ఉన్నందున వ్యక్తిగతంగా స్వీకరించలేద­ని వెల్లడించారు. 

సోమవారం హైదరాబాద్‌కు వెళ్లి నోటీసులు స్వయంగా తీసుకున్న తర్వాత తన ప్రతిస్పందన ఉంటుందన్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యే­లు దానం నాగేందర్‌ (ఖైరతాబాద్‌), కడియం శ్రీహరి (స్టేషన్‌ ఘ­న­పూర్‌), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ)కి నోటీసులు సిద్ధమైనట్లు తెలిసింది. స్పీకర్‌ ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో తిరిగి వచ్చిన తర్వాత నెలాఖరులోగా మిగతా ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవె­ళ్ల)కు కూడా నోటీసుల జారీ ప్రక్రియ కొనసాగుతుందని సమా­చారం. ఫిర్యాదులు, ఆధారా­లు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ స్పీకర్‌ నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.   

ఢిల్లీకి స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ 
ఢిల్లీలో జరిగే ఆలిండియా స్పీకర్స్‌ కాన్ఫరెన్స్‌లో పా­ల్గొనేందుకు శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ నేతృత్వంలోని బృందం శనివారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. స్పీకర్‌తోపాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ నరసింహాచార్యులుతోపాటు పలువురు అసెంబ్లీ అధికారులు ఈ బృందంలో ఉన్నారు. 

1925లో భారతదేశ సెంట్రల్‌ లేజిస్లేటివ్‌ అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికైన మొదటి భారతీయుడు విఠల్‌ బాయి పటేల్‌ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 24, 25 తేదీల్లో ఢిల్లీలో స్పీకర్ల సదస్సును నిర్వహిస్తున్నారు. ఇటీవలే కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఈ భేటీకి హాజరుకావడం లేదని మండలి వర్గాలు చెప్పాయి. 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)