అమ్మను చంపొద్దు నాన్నా..

Published on Fri, 11/21/2025 - 04:02

ఖమ్మం క్రైం: అనుమానమే పెనుభూతంగా మారడం.. తనకు దూరంగా ఉంటోందని కక్ష పెంచుకున్న ఓ భర్త రెక్కీ నిర్వహించి మరీ భార్యను దారుణంగా హతమార్చాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. జిల్లాలోని చింతకాని మండలం నేరడకు చెందిన గోగుల భాస్కర్‌కు ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన సాయివాణి (35)తో పదిహేనేళ్ల క్రితం వివాహం జరగగా పిల్లలు హర్షవరి్ధని, హేమేంద్ర ఉన్నారు. 

వివాహం అయినప్పటి నుంచి సాయివాణిని అనుమానంతో వేధిస్తున్న భాస్కర్, ఆ తర్వాత మద్యానికి బానిసై పొలం, రెండు ట్రాక్టర్లు అమ్మేశాడు. ఆయనలో మార్పు రాకపోవడంతో సాయివాణి ఏడాది క్రితం పిల్లలతో సహా జగ్గయ్యపేటలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆపై పిల్లలను ఖమ్మంలోని తన సోదరి వద్ద ఉంచి చదివిస్తోంది. సోదరి సూచనతో సాయివాణి గత మే నెలలో ఖమ్మం వచ్చి ఓ ఫంక్షన్‌ హాల్‌లో పనికి కుదిరి పిల్లలిద్దరితో అద్దె ఇంట్లో జీవిస్తోంది. 

పిల్లలు వద్దని వేడుకున్నా..
ఏడాదిగా కుటుంబాన్ని పట్టించుకోని భాస్కర్‌కు సాయివాణిపై కక్ష మరింత పెరగడంతో ఆమె ఉంటున్న ఇంటిని గుర్తించి కొన్నాళ్లుగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆమె ప్రతిరోజూ ఉదయం 7గంటలకు వాకిలి ఊడ్చేందుకు బయటకు వస్తుందని గుర్తించి గురువారం తెల్లవారుజామునే వచ్చి ఆమెపై కత్తితో దాడి చేశాడు. సాయివాణి అరుపులకు ఇద్దరు పిల్లలు భయపడి ‘అమ్మను చంపొద్దు నాన్నా’అని వేడుకున్నా ఆమె కడుపులో పొడిచాడు. 

కింద పడగానే ఆమెపై కూర్చుని గొంతుపై పొడుస్తుండగా కుమారుడు హేమేంద్ర సమీపంలోని ఆమె సోదరి ఇంటికి వెళ్లి చెప్పాడు. ఆపై కుమార్తె హర్షవర్థిని కత్తి లాక్కునే ప్రయత్నం చేయగా ఆమె చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈలోపు సోదరి భర్త ఉపేందర్‌ వచ్చేలోగా అప్పటికే ప్రాణాలు పోయిన సాయివాణి తల వేరు చేయడానికి భాస్కర్‌ ప్రయత్నిస్తుండగా ఉపేందర్‌ గట్టిగా పట్టుకున్నాడు. 

అంతలో వచ్చిన పోలీసులు మద్యం మత్తులో ఉన్న భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధినిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని ఏసీపీ రమణమూర్తి, టూటౌన్‌ సీఐ బాలకృష్ణ పరిశీలించారు.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)