Breaking News

భార్యను చంపి.. మృతదేహం ఫొటో ప్రియురాలికి పంపి..

Published on Thu, 07/09/2026 - 04:17

వాషింగ్టన్‌: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన భార్యను హత్య చేశాడనే అభియోగాలపై అరెస్టయ్యాడు. తొమ్మిది నెలలపాటు సాగిన దర్యాప్తు చేసిన అనంతరం పోలీసులు అతడిపై ఫస్ట్‌ డిగ్రీ మర్డర్‌ కేసు నమోదు చేశారు. భార్యను గొంతు నులిమి హత్య చేసి, నేరాన్ని దాచిపెట్టేందుకు ఘటనా స్థలంలో ఆధారాలు మార్చినట్లు బెలెవ్యూ పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, 30 ఏళ్ల అవినాష్‌ నార్నే భార్య రాజిత సబ్బినేని (27) 2025 అక్టోబర్‌లో అమెరికా వాషింగ్టన్‌లోని వారి అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురయ్యారు. 

వివాహమైన ఆరు నెలలకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఘటన జరిగిన రోజు తన భార్య బాత్రూంలో తలుపు వేసుకుని బయటకు రావడం లేదని అవినాష్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా రాజిత మృత దేహం కనిపించింది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించినా, పోస్టుమార్టంలో గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతో మరణించినట్లు తేలింది. దీంతో పోలీసులు హత్యగా నిర్ధారించారు. 

డిజిటల్‌ ఆధారాలతో బయటపడిన నిజం 
ఘటన సమయంలో తాను 40 నిమిషాలు బయటకు వెళ్లి వచ్చినట్లు అవినాష్‌ చెప్పాడు. అయితే అపార్ట్‌మెంట్‌ స్మార్ట్‌ లాక్, డోర్‌ సెక్యూరిటీ డేటాను పరిశీలించిన పోలీసులు, అతడు బయటకు వెళ్లిన సమయంలో మరెవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని గుర్తించారు. దీంతో ఇతరులు హత్య చేసి ఉండే అవకాశాన్ని పోలీసులు కొట్టిపారేశారు. దర్యాప్తులో అవినాష్ కు భారత్‌లో మరో మహిళతో రహస్య ప్రేమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. పెళ్లికి ముందు ప్రారంభమైన ఆ సంబంధం, పెళ్లి తర్వాత కూడా కొనసాగినట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఆ మహిళ వీరి వివాహానికి కూడా హాజరైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. 

కస్టడీలో అవినాష్‌ 
హత్య జరిగిన మరుసటి రోజే రాజిత మృతదేహం ఫొటోను అవినాష్‌ తన ప్రియురాలికి పంపినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో ఆ విషయాన్ని అవినాష్‌ అంగీకరించాడు. మరణానికి ముందు కొన్ని వారాలుగా అవినాష్, రాజిత మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలను పోలీసులు విశ్లేషించారు. అవినాష్‌ తయారు చేసిన పానీయాలకు చేదు రుచి వస్తోందని రాజిత పలుమార్లు చెప్పినట్లు పోలీసులు గుర్తించారు.

హత్య జరిగిన రోజు కూడా భర్త చేసిన స్మూతీ ‘మందులా, దగ్గు సిరప్‌లా ఉంది’అని ఆమె చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. అవినాష్‌ను అరెస్టు చేశాక జూలై 1న స్థానిక కోర్టులో అతడిపై ఫస్ట్‌ డిగ్రీ మర్డర్‌ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. బెయిల్‌ కావాలంటే అతడు కోర్టుకు సుమారు రూ.48 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. నేరం రుజువైతే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)