Breaking News

‘అడవి రాముడి’కి నవ వసంతం

Published on Wed, 04/10/2024 - 05:44

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలోని సుక్మా జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మూతబడిన ఒక రామాలయం తలుపులు సీఆర్పిఎఫ్‌ అధికారుల చొరవతో 21 ఏళ్ల అనంతరం తెరుచుకున్నాయి. సుక్మా జిల్లాలోని చింతల్‌నార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కేరళపొంద గ్రామంలో పురాతన రామమందిరం ఉంది. ఆ గుడిలో గ్రామస్తులు ప్రతిరోజూ పూజలు నిర్వహించేవారు. దీనిపై ఆగ్రహించిన మావోయిస్టులు 2003 సంవత్సరంలో గుడి మూసేసి తాళాలు వేశారు. అప్పటి నుంచి ఆలయం నిరాదరణకు గురైంది. మావోయిస్టుల భయంతో స్థానికులు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఎదురైంది.

అయితే, కేరళపొంద గ్రామంలో నెల రోజుల క్రితం సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు నిర్మించారు. ఈ క్రమంలో అధికారులు తరచుగా గ్రామస్తులతో సమావేశమై సమస్యలు తెలుసుకుంటుండగా.. 21 ఏళ్లుగా తెరుచుకోని రామాలయ అంశం బయటపడింది. అయితే, తమకు తాముగా గుడి తెరిస్తే మావోయిస్టులు ఇబ్బంది పెడతారని గ్రామస్తులు చెప్పడంతో సీఆర్‌పీఎఫ్‌ అధికారులు చొరవ తీసుకుని మంగళవారం ఆలయాన్ని తెరిచారు. 74వ బెటాలియన్‌కు చెందిన అధికారులు, జవాన్లతో పాటు గ్రామస్తులు ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలను శుభ్రం చేశారు.

ఈ రామమందిరంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలు సుందరంగా ఉన్నాయని, గుడి శిఖరంపై ఆంజనేయస్వామి విగ్రహం ఉందని పోలీసులు తెలిపారు. గుడి తలుపులు తెరుచుకోవడంతో గ్రామస్తులు సంతోషంతో నృత్యం చేశారు. ఇక నుంచి ప్రతిరోజూ పూజలు చేస్తామని, ఈ ఏడాది శ్రీరామనవమి కూడా ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్తులు వెల్లడించారు. 

#

Tags : 1

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)