Breaking News

మల్లన్న సన్నిధిలో.. సీతారాముల కల్యాణం

Published on Sat, 04/05/2025 - 05:28

ఓదెల (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఈనెల 6న నిర్వహించనున్న శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీసంఖ్యలో తరలివస్తారు. ఉదయం సుప్రభాత సేవతో పూజలు, వేడుకలు ప్రారంభమవుతాయి. ఆదివారం ఉదయం 11.30 గంటలకు శ్రీసీతారాముల కల్యాణ ప్రక్రియ ప్రారంభిస్తారు. దేవతామూర్తులను మంగళవాయిద్యాలతో వేదికపైకి తీసుకొచ్చి ఆశీనులు చేస్తారు.  

చకచకా ఏర్పాట్లు.. 
ఓదెల శ్రీమల్లికార్జునస్వామి సన్నిధిలో నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణం కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. భక్తులకు నీడ సౌకర్యం కల్పించేందుకు చలువ పందిళ్లు నిర్మిస్తున్నారు. మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ఇప్పటికే సమీక్షించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్వామివారికి పట్టువ్రస్తాలను సమరి్పస్తారు. అర్చకుడు ఆరుట్ల శ్రీనివాసచార్యుల ఆధ్వర్యంలో కల్యాణం జరిపిస్తారు.

వైభవంగా కల్యాణం  
ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అ«ధికారుల ఆధ్వర్యంలో స్వామివార్ల కల్యాణం సుమారు మూడుగంటల పాటు నిర్వహిస్తాం. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులు తీర్థప్రసాదాలు అందిస్తాం. – ఆరుట్ల శ్రీనివాసచార్యులు, అర్చకుడు

ఏర్పాట్లు చేస్తున్నాం  
ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆదివారం జరిగే సీతారాముల కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నాం. నీడ, మంచినీరు, వసతి గదులు అందుబాటులో ఉంచుతాం. ఆలయాన్ని విద్యుద్‌ దీపాలతో అలంకరిస్తాం. – బొడ్క సదయ్య, ఆలయ ఈవో, ఓదెల

కనుల పండువగా ఉంటుంది 
ఓదెల మల్లన్న సన్నిధిలో ఏటా శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా జరిపిస్తారు. మూడుగంటల పాటు మంగళవాయిద్యాలతో కల్యాణం జరుగుతుంది. అధికసంఖ్యలో భక్తులు తరలిరావాలి. – రంగు బ్రహ్మచారి, భక్తుడు కొలనూర్‌  

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు