Breaking News

31 అర్ధరాత్రి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్‌

Published on Fri, 08/22/2025 - 01:45

సాక్షి, హైదరాబాద్‌: పది రోజుల్లో బకాయిలు చెల్లించడంతో పాటు వైద్య సేవలకు నిర్ణయించిన ధరలను ప్రభుత్వం పునఃసమీక్షించని పక్షంలో ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (తన్హా) తెలిపింది. గత జనవరిలో ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 

తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్‌కు గురువారం నోటీసు పంపించినట్లు తన్హా అధ్యక్షుడు డాక్టర్‌ వద్దిరాజు రాకేష్‌ తెలిపారు. ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్‌ఎస్‌) కింద అందిస్తున్న సేవలకు గాను ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగడం లేదని, ఈ పరిస్థితుల్లో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొన్నారు.  

రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు 
ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రంలో 471 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ప్రభుత్వం సుమారు రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు సమాచారం. 2023 డిసెంబర్‌ 8వ తేదీ వరకు రూ.723.97 కోట్ల మేర బకాయిలు ఉండగా, కాంగ్రెస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెల సగటున రూ.100 కోట్లకు తగ్గకుండా చెల్లింపులు చేస్తూ వస్తున్నట్లు ఆరోగ్యశాఖ చెపుతోంది. 

ఈ నేపథ్యంలో గత జూన్‌ 9 నాటికి బకాయిలు రూ.981 కోట్లకు చేరాయి. తాజాగా ఈ బకాయిలు రూ.1,000 కోట్లకు పైగానే పేరుకుపోయినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో బకాయిలు ఉన్నా ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు రాకేష్‌ వివరించారు.  

గత జనవరిలో సేవలు నిలిపివేత 
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో గత జనవరిలో వైద్య సేవలను నిలిపివేస్తూ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వం స్పందించి రూ.117 కోట్లు విడుదల చేసింది. అయితే అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన ప్యాకేజీల సవరణ, క్రమం తప్పకుండా బకాయిల చెల్లింపు, ఒప్పందాల పునరుద్ధరణ వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆక్షేపిస్తూ తాజాగా మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని అసోసియేషన్‌ నిర్ణయించింది.  

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)