Breaking News

గుండెపోటుతో ఆర్మీ మేజర్‌ మృతి

Published on Sun, 01/15/2023 - 01:26

పరకాల: పండుగ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు వారం క్రితం సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆర్మీ మేజర్‌ దూడపాక సాయికిరణ్‌ (31)గుండెపోటుతో మృతిచెందాడు. హనుమకొండ జిల్లా పరకాలలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పరకాల పట్టణంలోని మల్లారెడ్డి కాలనీకి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి దూడపాక పోశయ్య, సుశీల దంపతులకు సాయికృష్ణ, సాయికిరణ్‌లు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరినీ చిన్నప్పుడే తండ్రి గోల్కొండ సైనిక్‌ స్కూల్‌లో చేర్చారు. ప్రస్తుతం సాయికిరణ్‌ అమృత్‌సర్‌ లో మేజర్‌గా విధులు నిర్వహిస్తుండగా సోదరుడు సాయికృష్ణ జోధ్‌పూర్‌లో పనిచేస్తున్నాడు.

సాయికిరణ్‌కు 5 ఏళ్ల క్రితం అపూ ర్వతో వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాలు కుమారుడు ఉన్నాడు. సంక్రాంతి పండుగ కోసం ఈ నెల 7న సాయికిరణ్‌ పరకాలకు చేరుకున్నాడు. అంతకన్నా ముందే సోదరు సాయికృష్ణ కూడా సెలవుల్లో ఇంటికి వచ్చాడు. కాగా, సాయికిరణ్‌ శనివారం బూత్‌రూమ్‌కు వెళ్లి వచ్చిన కొద్ది సేపటికే గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు పరకాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్‌ నిర్ధారించారు. ఆదివారం సాయికిరణ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పరకాల సీఐ పుల్యాల కిషన్‌ తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)