కుసుమ్‌కు ఈఆర్సీ ఆమోదం

Published on Wed, 04/23/2025 - 03:13

సాక్షి, హైదరాబాద్‌: పీఎం–కుసుమ్‌ పథకం కాంపోనెంట్‌–ఏ కింద 4,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) అనుమతిచ్చింది. మహిళాశక్తి పథకం కింద స్వయం సహాయ సంఘాల (ఎస్‌హెచ్‌జీ) నుంచి 1,000 మెగావాట్లు, రైతుల నుంచి 3,000 మెగావాట్లు కలిపి మొత్తం 4,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3.13 ధరతో 25 ఏళ్లపాటు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ ఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కుసుమ్‌ పథకం కాంపోనెంట్‌–ఏ కింద కేంద్రం గతంలో రాష్ట్రానికి 4,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతిచ్చి, ఆ తర్వాత 1,000 మెగావాట్లకు తగ్గించింది. రాష్ట్రప్రభుత్వం మాత్రం 4,000 మెగావాట్ల సౌర ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) ఆహ్వానించగా, పెద్ద సంఖ్యలో దరఖాస్తులొచ్చాయి. 

కేంద్రం 1,000 మెగావాట్లకే అనుమతివ్వగా, మిగిలిన 3,000 మెగావాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ఏ విధంగా అనుమతులిస్తారని గతంలో ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో కొందరు ప్రశ్నించారు. రద్దు చేసిన 3000 మెగావాట్ల అనుమతులను మళ్లీ పునరుద్ధరించాలని కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీ తెలిపారు. ఒకవేళ కేంద్రం అనుమతివ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గంలో ఈ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 

ఈ పథకం కింద సౌరవిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు గత నెలలో ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించిన తర్వాత, అందుకు అనుమతి కోరుతూ ఈఆర్సీకి దరఖాస్తు చేయగా.. ముందు తీసుకున్న చర్యలకు తర్వాత అనుమతులు ఇవ్వలేమని డిస్కంలకు ఈఆర్సీ స్పష్టం చేసింది. రైతులు–డెవలపర్ల మధ్య జరిగే భూముల లీజు ముసాయిదా ఒప్పందాన్ని సైతం ఆమోదించడానికి నిరాకరించింది. ముసాయిదా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)కు మాత్రం ఆమోదం తెలిపింది.    

28 వేల సౌర పంప్‌సెట్ల ఏర్పాటు 
కుసుమ్‌–సీ కాంపోనెంట్‌ కింద రాష్ట్రానికి 28 వేల సోలార్‌ పంప్‌సెట్లను కేంద్రం మంజూరు చేసిందని డిస్కంలు ఈఆర్సీకి తెలిపాయి. కాంపోనెంట్‌–బీ కింద ఆఫ్‌ గ్రిడ్‌ సోలార్‌ పంప్‌సెట్ల ఏర్పాటుకు సైతం అనుమతులు కోరుతున్నామని వివరించాయి.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)