దసరా తర్వాత ‘వైన్స్‌కు’ దరఖాస్తులు!

Published on Thu, 09/11/2025 - 04:55

సాక్షి, హైదరాబాద్‌: రానున్న రెండేళ్ల కాలానికి  వైన్‌షాపుల నిర్వహణ కోసం దసరా పండుగ తర్వాత దరఖాస్తులు తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖ యోచిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌ 30తో ప్రస్తుత షాపులకు గడువు ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్‌ 5వ తేదీ తర్వాత కొత్త పాలసీ ప్రకారం నోటిఫికేషన్‌ ఇచ్చే ఆలోచనలో ఆ శాఖ అధికారులున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు తగినంత సమయం ఇవ్వడం ద్వారా ఎక్కువ దరఖాస్తులు వచ్చేలా చూడాలన్న ఆలోచనతోనే దసరా ముగిసిన వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావిస్తున్న ట్టు సమాచారం. 

అయితే  రాష్ట్రంలో 2,620 వైన్‌షాపులుండగా ఆ సంఖ్యను పెంచుతారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎంత జనాభాకు ఒక వైన్‌షాపు ఉండా లో 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ధారించా రు. ఆ తర్వాత జనగణన జరగక పోవడంతో ఇప్పటికీ ఆ సంఖ్యనే కొనసాగిస్తున్నారు. కానీ ఈసారి షాపుల సంఖ్యను పెంచే అవకాశాలున్నాయని ఎక్సైజ్‌ వర్గాలంటున్నాయి.  

గత పాలసీతో రూ.2,920 కోట్ల ఆదాయం 
గత రెండేళ్ల పాలసీ ప్రకారం వైన్‌షాపుల నిర్వహ ణకు ఆహ్వానించిన దరఖాస్తుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,920 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. ఈసారి ఆదాయం రూ.3,500 కోట్లు దాటుతుందనే అంచనాలో ఎక్సైజ్‌ శాఖ ఉంది. దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలకు పెంచి, తగిన స మయం కూడా ఇస్తే ఈ ఆదాయం మరింత పెరు గుతుందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి దరఖాస్తుల స్వీకరణకు నెలన్నర రోజులు గడువు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. 

మరోవైపు ఆదాయార్జిత శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచి్చనప్పటికీ ఇప్పుడప్పుడే స్థానచలనం అవసరం లేదనే భావనలో ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులున్నట్టు తెలుస్తోంది. ఈసారి వైన్‌షాపుల ఏర్పాటు కోసం దరఖాస్తుల ప్రక్రియ ముగిసి, కొత్త షాపులు ప్రారంభమైన తర్వాత బదిలీలతో పాటు పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను కూడా చేపట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)