Breaking News

ఈబీసీలకూ ‘రాజీవ్‌ యువ వికాసం’

Published on Sun, 03/23/2025 - 06:11

సాక్షి, హైదరాబాద్‌:  ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నిరుద్యోగులకు కూడా రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఆది లేదా సోమవారాల్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. శనివారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈబీసీలకు రాయితీ రుణాలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఇప్పటికే రాజీవ్‌ యువ వికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజీవ్‌ వికాసం పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈబీసీ రాయితీ రుణాలకు సంబంధించిన అంశం పెండింగ్‌లో ఉండటంతో మార్గదర్శకాల జారీలో ఆలస్యమైనట్లు సమాచారం.

ఈ పథకం మార్గదర్శకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచాయి. వీటిని ఆమోదించి, ఉత్తర్వులు జారీ చేసిన మరుక్షణమే ఈబీసీల దరఖాస్తులను ఓబీఎంఎంఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రి పొన్నం, ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్‌ కె. రామకృష్ణారావు

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)