Breaking News

కిక్కే కిక్కు.. తెలంగాణ అబ్కారీ శాఖకు కాసుల పంట!

Published on Fri, 08/18/2023 - 18:22

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మద్యం టెండర్ల ప్రక్రియకు గడువు ముగిసింది. చివరి రోజు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్, వరంగల్, మహబూబ్ నగర్‌లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా రంగారెడ్డి, హైదరాబాద్‌ నుంచి.. అత్యల్పంగా నిర్మల్‌ నుంచి దాఖలయ్యాయి. మొత్తం లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ టెండర్ల ప్రక్రియ ద్వారా..  రూ.2వేల కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. తద్వారా అబ్కారీ శాఖకు భారీగా ఆదాయం సమకూరినట్లయ్యింది

రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు టెండర్లు నిర్వహించగా, ఎక్సైజ్ శాఖ అంచనాలను మించి దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ రాత్రి 12 లేదా రాత్రి ఒంటి గంట వరకు పూర్తి స్థాయి లెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1,03,489 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. గత ఏడాది 79 వేల దరఖాస్తులు రాగా, గత ఏడాదితో పోలిస్తే 40 శాతం దరఖాస్తులు పెరిగాయి.
చదవండి: కాంగ్రెస్‌ రూట్‌లో కమలం.. సర్‌ప్రైజ్‌ అందుకే! 

ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉండటంతో మద్యం టెండర్ ప్రక్రియతో అబ్కారీ శాఖకు కాసుల పంట పడుతోంది. ఈ నెల 21న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. అదే రోజు లైసెన్సులు జారీ చేయనున్నారు. డిసెంబర్ 1నుంచి కొత్త షాపులు ప్రారంభం కానున్నాయి.

టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌
తెలంగాణ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రద్దు చేయాలంటూ  లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు భూక్యా దేవా నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీసా చట్టానికి అనుగుణంగా వైన్స్ టెండర్స్ నోటిఫికేషన్ జారీ చేయలేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

షెడ్యూల్ ఏరియాలో పీసా చట్టానికి అనుగుణంగా తీర్మాణాలు తెలంగాణ ఎక్సైజ్ శాఖ  తీసుకోకుండా టెండర్ల ప్రక్రియ జారీ చేసిందని, వెంటనే టెండర్లు నిలిపి వేయాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది మంగీలాల్ నాయక్ కోరారు. రేపటి వరకు ప్రభుత్వం సమయం కోరగా, తదుపరి విచారణను హైకోర్టు.. రేపటికి వాయిదా వేసింది.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు