Breaking News

ఆర్డీఎస్‌ ఎత్తు పెంచొద్దు!

Published on Tue, 07/28/2026 - 04:11

సాక్షి, హైదరాబాద్‌: నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్‌) ఆధునికీకరణ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్రం కోరింది. ఆర్డీఎస్‌ ఆనకట్టలో పూడిక తొలగించడంతోపాటు ఎత్తు పెంచాలని చెప్పింది. ఆర్డీఎస్‌ ఆధునీకరణతోపాటు పూడిక తొలగింపునకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఎత్తు పెంపు, సామర్థ్యం పెంపును ససేమిరా అంగీకరించమని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది. 

తుంగభద్ర పరీవాహక ప్రాంత సమస్యల పరిష్కారానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ పైథాంకర్‌ అధ్యక్షతన తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల అధికారులతో కేంద్రం ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ తొలి సమావేశం సోమవారం వర్చువల్‌గా జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్‌) రమేశ్‌ బాబు, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ (ఇరిగేషన్‌) నరసింహమూర్తి, కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి బీఎస్‌ శివకుమార్‌ ఈ సమావేశంలో హాజరై తమ రాష్ట్రాల వాదనలను వినిపించారు. ఆర్డీఎస్‌ ద్వారా తమ రాష్ట్రానికి రావాల్సిన వాటా నీళ్లు అందడం లేదని, తక్షణమే ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. హైపవర్‌ కమిటీ విధివిధానాలపై తమ అభిప్రాయాన్ని 15 రోజుల్లోగా తెలియజేస్తామని తెలంగాణ పేర్కొంది.

తుంగభద్ర డ్యామ్‌లో పూడిక తొలగింపునకు ఓకే..
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయంలో పూడికతో నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని, పూడిక తొలగించాలని, లేకుంటే ఎగువన తుంగభద్ర నదిపై నావళి వద్ద 33 టీఎంసీలతో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించాలని కర్ణాటక కోరగా, రిజర్వాయర్‌ నిర్మాణానికి ఏపీ, తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేశాయి. తుంగభద్ర జలాశయంలో పూడిక తొలగింపు చేపట్టడానికి ఏపీ, తెలంగాణ మద్దతు తెలిపాయి. దీంతో పూడిక తొలగింపుపై అధ్యయనం కోసం ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. హైపవర్‌ కమిటీ తదుపరి సమావేశం ఢిల్లీలో నిర్వహించాలని, సభ్యులందరూ భౌతికంగా పాల్గొనాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)