Breaking News

‘మేం ఏపీకి వెళ్లలేం’.. క్యాట్‌లో ఐఏఎస్‌ల పిటిషన్‌

Published on Mon, 10/14/2024 - 16:26

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ కేడర్‌ విభజనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

తమను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసిందని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, ఆమ్రపాలి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్‌ అధికారిణి సృజన కోరారు. నలుగురు ఐఏఎస్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ల క్యాట్‌ మంగళవారం విచారణ చేపట్టనుంది.

తెలంగాణ సీఎస్‌ శాంతికుమారితో భేటీ
తెలంగాణ సీఎస్‌ శాంతికుమారితో ఏపీ కేడర్‌ ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు సమావేశమయ్యారు. సీఎస్‌తో వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, అమ్రాపాలితో పాటు పలువురు అధికారులు భేటీ అయ్యారు. 

గతవారం ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లు ఎల్లుండి (అక్టోబర్‌ 16) లోపు రిపోర్టు చేయాలని డీవోపీటీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌) ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఐఏఎస్‌లు ఇంకా రిలీవ్‌ కాలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.  

ఈ తరుణంలో డీవోపీటీ ఆదేశాల మేరకు ఎల్లుండి ఏపీలో రిపోర్ట్ చేసే విషయంపై సీఎస్‌తో అధికారులు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విముఖత వ్యక్తం చేశారు.  ఇప్పటికే తాము ఏపీకి వెళ్ళబోమని డీవోపీటీకి విజ్ఞప్తి చేయగా.. ఆ విజ్ఞప్తిని డీవోపీటీ తిరస్కరించింది. దీంతో ఐఏఎస్‌ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. రేపు క్యాట్‌ విచారణ చేపట్టనుంది. అనంతరం ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లు ఏపీకి వెళ్తారా? లేదంటే తెలంగాణలోనే కొనసాగుతారా? అనేది తేలనుంది.

ఏపీలో మేం పని చేయలేం ఐఏఎస్ అధికారుల విముఖత

👉చదవండి: మీరు వెళ్లాల్సిందే

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)