Breaking News

దరఖాస్తులకు మరో చాన్స్‌

Published on Mon, 01/20/2025 - 04:00

సాక్షి, హైదరాబాద్‌: కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 21 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రామసభల్లోనూ ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో ఆదివారం ఓ సర్క్యులర్‌ను పంపారు. 

దాని ప్రకారం గ్రామ సభల్లో కొత్త రేషన్‌కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్ల చేర్పు కోసం దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. అదే విధంగా ఒక కుటుంబం నుంచి వేరు పడుతున్న కుటుంబాలకు కొత్త కార్డులిచ్చేందుకు కూడా దరఖాస్తులు తీసుకోవాలి. కుటుంబ పెద్దతో పాటు ఇతర కుటుంబ సభ్యు ల వివరాలు, వారి ఆధార్‌ కార్డులు, కులం, మొబైల్‌ నంబర్, చిరునామా తదితర వివరాల­ను సేకరించాలి. 

అదేవిధంగా ప్రజాపాలన సేవా కేంద్రాలు, మీసేవ కేంద్రాల నుంచి వచ్చే దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక ఇప్పటికే వచ్చిన 1.36 కోట్ల మందికి సంబంధించిన 41.25 లక్షల కుటుంబాల దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయాలి. కులగణనలో భాగంగా కార్డు లేదని సమాచారం ఇచ్చిన వారి వివరాలను కూడా పరిశీలించాలి. వీటికి తోడు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించిన తర్వాతే లబ్ధిదారుల జాబితాను ఖరారు చేయాల్సి ఉంటుందని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.

గ్రామసభల్లో ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి 
ఇందిరమ్మ ఇళ్లకు కూడా గ్రామసభల్లో దరఖాస్తులు వస్తే తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో పక్కా ఇళ్లు లేని వారి వివరాలను కలెక్టర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్ల లాగిన్‌లో అందుబాటులో ఉంచామని, వాటి పరిశీలన వెంటనే పూర్తి చేయాలని సర్క్యులర్‌లో సూచించారు. రేషన్‌కార్డుల తరహాలోనే దరఖాస్తుదారుల అన్ని వివరాలను గ్రామ సభల్లో నమోదు చేసుకోవాలని, ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా వచ్చే దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. 

రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను మదింపు చేయడం, ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోలేని వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడం, ఇందుకు సంబంధించి ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకునే విధంగా గ్రామసభలు నిర్వహించాలని సూచించారు.

ఆ పంచాయతీల్లోనూ ఆత్మీయ భరోసా 
భూమి లేని పేదల కుటుంబాలకు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయాన్ని ఆ కుటుంబంలోని మహిళల బ్యాంకు ఖాతాకు జమ చేయాలని సీఎస్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను ఇప్పటికే కలెక్టర్లకు, డీఆర్‌డీవోలకు పంపామని పేర్కొన్నారు. అదే విధంగా 2023–24 సంవత్సరంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం అయిన 156 గ్రామ పంచాయతీల్లోనూ ఈ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని సర్క్యులర్‌లో సీఎస్‌ స్పష్టం చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)