Breaking News

ఆర్టీసీ ఉద్యోగులకు మరో 5శాతం డీఏ

Published on Sun, 09/03/2023 - 04:42

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యాన్ని (డీఏ) ప్రకటించింది. ఈసారి డీఏను 5 శాతం పెంచింది. దీనితో ప్రస్తుతమున్న 72.8 శాతం నుంచి 77.8 శాతానికి డీఏ పెరిగిందని.. సెప్టెంబర్‌ వేతనం నుంచే దీనిని చెల్లిస్తామని అధికారులు తెలిపారు.

2019 జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏలను ఇటీవల వరుసగా ప్రక టిస్తూ రాగా.. ప్రస్తుతం 2023 జూలై డీఏ ఒక్కటి మాత్రమే పెండింగులో ఉన్నట్టయింది. ఆర్టీసీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు సంస్థ 8 డీఏలను మంజూరు చేసిందని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యో గులు కష్టపడి పనిచేస్తున్నారని, బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.

పెండింగ్‌ బకాయిల ప్రస్తావన లేదు
పెండింగ్‌ డీఏల అమలును ప్రకటిస్తూ వస్తున్న ఆర్టీసీ.. వాటికి సంబంధించిన బకాయిలు (ఇప్పటివరకు చెల్లించాల్సిన మొత్తాన్ని) మాత్రం ఇవ్వటం లేదు. కేవలం అమల్లోకి తెచ్చిన నెల నుంచే లెక్కిస్తూ చెల్లి స్తోంది. ఇలా ఇప్పటివరకు సుమారు 168 నెలల బకాయిలు ఉన్నాయని, ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఓ విడత డీఏ బకాయిని ప్రకటించేలోపు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు దాని లబ్ధి కలగటం లేదని.. అలాంటి వారికి లబ్ధి కలగాలంటే బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా డీఏలను చెల్లించడాన్ని స్వాగతిస్తు న్నామని.. అయితే బకాయిల సొమ్ము కూడా అందితేనే అందరు ఉద్యోగులకు న్యాయం జరిగినట్టు అవుతుందని ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి వీఎస్‌రావు పేర్కొన్నారు. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)