అన్నారం బ్యారేజీ ఖాళీ 

Published on Mon, 02/19/2024 - 04:05

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి అన్నారం(సరస్వతీ) బ్యారేజీలో మరమ్మతుల కోసం ఇంజనీరింగ్‌ అధికారులు గేట్లు ఎత్తి నీటిని ఖాళీ చేశారు. బ్యారేజీ సమగ్ర సర్వే కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఆదివారం వరకు బ్యారేజీలోని 10–15 గేట్లు ఎత్తి పూర్తి నీటిని రెండువేల క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నారు.

నీటిని పూర్తిగా ఖాళీ చేయడంతో బ్యారేజీ పొడవునా 1.6 కిలోమీటర్ల దూరం వరకు లక్ష క్యూబిక్‌ మీటర్ల మేర గేట్ల వద్ద అర మీటరు ఎత్తులో ఇసుక పేరుకుంది. దీంతో బ్యారేజీలో సమగ్ర సర్వే చేసేందుకు వీలవుతుందా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇసుక తీయకపోతే ఫౌండేషన్, పియర్, ర్యాప్‌్టల కింద ఖాళీ ప్రాంతం ఎక్కడ ఎంత మేర ఉందనేది తెలియదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇసుక తొలగించిన తరువాతనే సీపేజీ లీకేజీపై విశ్లేషణ సాధ్యం అవుతుందని అంటున్నారు. గేట్లు కూడా పాడైపోయినట్లు సమాచారం.  

తడి ఆరిన తర్వాతే సర్వే: నీటిని పూర్తిగా తొలగించిన అధికారులు బ్యారేజీ దిగువన తడి ఇసుక, రేగడి మట్టితో దిగబడుతున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎండిన తరువాతనే సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీలోని 2.01 టీఎంసీలు నీటి నుంచి 10–15 గేట్లు ఎత్తగా 2వేల క్యూసెక్కుల నీరు దిగువకు తరలించారు.

నీరు ఖాళీ కావడంతో ర్యాప్‌్ట, పియర్‌లు దిగువ వేసిన సీకెంట్‌ ఫైల్స్‌ కింది భాగంలో ఏమైనా లీకేజీలు ఉన్నాయా.. ఫౌండేషన్‌ ఎగువ నుంచి ప్రారంభమై దిగువన ఎక్కడకు వెళ్తుంది.. కింద ఖాళీ ఉందా.. తెలుసుకోవడానికి సర్వే చేపట్టనున్నారు. ఒప్పందం మేరకు పార్సన్‌ అనే సంస్థ గ్రౌండ్‌ పెనట్రేషన్‌టెస్ట్‌ కోసం సర్వే చేయనుంది. ఈ సర్వే పూర్తయ్యాక ప్రత్యేక రసాయనాలతో తిరిగి మరమ్మతులు చేపట్టనున్నారు. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)