Breaking News

‘ప్లాస్టిక్‌ఫ్రీ జోన్‌’గా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌

Published on Thu, 05/30/2024 - 04:46

సాక్షి, హైదరాబాద్‌: అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ను జూలై ఆఖరులోగా పూర్తి ప్లాస్టిక్‌ రహిత జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగంపై నిషేధం అమలు చేయాలన్నారు. బుధవారం సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎస్‌ మాట్లాడారు. 

కాగితపు సంచులు, జనపనార సంచులు, విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో అదనపు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. టైగర్‌ రిజర్వ్‌లో ప్లాస్టిక్‌ నిషేధం గురించి హైవే వెంట ఉన్న స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించాలని చెప్పారు.

ఈ రిజర్వ్‌ పరిధిలోని నాలుగు ఆవాసాల్లో నివాసముంటున్న ప్రజలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. హరిత నిధి కింద ఉన్న నిధులను సంబంధిత ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మైసమ్మ ఆలయంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులకు చెప్పారు. 

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, పీసీసీఎఫ్‌ డోబ్రియాల్, పీసీబీ సభ్య కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎండోమెంట్స్‌ కమిషనర్‌ హనుమంత రావు పాల్గొన్నారు

Videos

తెలంగాణ బీజేపీ నేతల అరెస్ట్..!

మాట ఇచ్చి తప్పింది మీరు మమల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు..?

అమెరికా రక్షణ శాఖలో తీవ్ర కలకలం!

నేపాల్ వరదల్లో చిక్కుకున్న బాధిత ఫ్యామిలీ ఆవేదన

మంత్రి పదవి ఊస్ట్ హుటాహుటిన ఢిల్లీకి కొండా సురేఖ

రాజమండ్రి సెంట్రల్ జైలుకు సాధిక్ ఖాన్ తరలింపు

Hyderabad: దొంగలు బాబోయ్ దొంగలు

Kadapa : YSRకు వైఎస్ జగన్ ఘన నివాళి

గాలి భాను ప్రకాష్ క్వారీలపై రోజా సంచలన వ్యాఖ్యలు

Hyd: సెప్టెంబర్ లోనూ ఇంతే.. వర్షాలపై IMD హెచ్చరిక

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)