Breaking News

ఏఎంసీలో ఏమైంది?

Published on Thu, 05/23/2024 - 07:39

లక్డీకాపూల్‌: నిమ్స్‌ ఆస్పత్రిలోని పాత అక్యూట్‌ మెడికల్‌ కేర్‌ (ఏఎంసీ)లో ఏసీలు పని చేయకపోవడంపై బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నిమ్స్‌ మెడికల్‌ సూరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ నిమ్మ సత్యనారాయణను ఆదేశించింది. దీంతో నిమ్స్‌ యాజమాన్యం ఏఎంసీలోని పరిస్థితులపై సంజాయిషీ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి రాసిన లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. నిమ్స్‌లోని అక్యూట్‌ మెడికల్‌ కేర్‌ (ఏఎంసీ)లో ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ యూనిట్లు(ఏసీ) పురాతనమైనవి కారణంగా పనిచేయడం లేదని, మరమ్మతులు చేసినా ఫలితం కని్పంచడం లేదని లేఖలో అధికారులు పేర్కొన్నారు. 

ప్రస్తుత ప్యాకేజీ యూనిట్లను మరింత సమర్థవంతమైన డక్టబుల్‌ యూనిట్‌లతో భర్తీ చేయడానికి రూ.12.50 లక్షల వ్యయంతో అంచనా వేశామని తెలిపారు. ఈ మేరకు నిపుణుల అభిప్రాయం కోసం అంతర్గత కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా టెండర్లు వేయడం కుదరదని అడ్మిని్రస్టేషన్‌ సూచించిందని, ఈ కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని తాత్కాలికంగా అదే బ్లాక్‌లోని పాత ఐసీయూకి మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా..బుధవారం సాయంత్రానికల్లా ఏసీలను తాత్కాలికంగా మరమ్మతు చేయించారు. దీంతో పనిచేయడం మొదలు పెట్టాయని రోగుల బంధువులు పేర్కొన్నారు. ‘సాక్షి’ పుణ్యమా అని తమకు ఉపశమనం లభించిందని ఓ రోగి సహాయకుడు డానియేల్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

    

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)