Breaking News

అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి..నిందితులకు బెయిల్‌

Published on Mon, 12/23/2024 - 09:17

సాక్షి,హైదరాబాద్‌: హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడికి కారకులైన ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్‌ పోలీసులు సోమవారం(డిసెంబర్‌23) ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అయితే.. వీరికి అప్పటికప్పుడే  బెయిల్‌‌ మంజూరు అయ్యింది. 

అల్లు అర్జున్‌ నివాసంపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు..  ఒక్కొకరికి రూ.10వేల పూచికత్తుతో బెయిల్‌ ఇచ్చారు. మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినవారిలో రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ ఉన్నారు. నిందితులపై బీఎన్‌ఎస్‌ 331(5),190,191(2),324(2),292,126(2),131 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. నిందితులు మీ పార్టీ వాళ్లంటే.. మీ పార్టీ వాళ్లంటూ కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌లు పరస్పర ఆరోపణలకు దిగాయి.

కాగా, సంధ్య థియేటర్‌లో పుష్ప సినిమా బెనిఫిట్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అల్లు అర్జున్‌ స్పందన సరిగా లేదని ఓయూ జేఏసీ పేరిట పలువురు ఆయన ఇంటి వద్ద ఆదివారం ఆందోళనకు దిగారు. అల్లు అర్జున్‌ ఇంటి లోపలికి చొచ్చుకెళ్లి రాళ్లు వేయడంతో పాటు అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. ఈ దాడిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. 

ఇదీ చదవండి: పుష్ప అభిమాని అరెస్ట్‌ 

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)