Breaking News

నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా అల్లు అర్జున్‌ హాజరు

Published on Sat, 12/28/2024 - 05:05

హైదరాబాద్‌: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో ప్రమే­యంపై ఆరోపణలు ఎదు­ర్కొంటున్న హీరో అల్లు అర్జున్‌ శుక్రవారం హైదరా­బాద్‌ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజి్రస్టేట్‌ కోర్టు ఎదుట వర్చువల్‌గా హాజరయ్యా రు. ఈ కేసులో ఏ–11గా ఉన్న ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించగా హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడం తెలిసిందే. 

జ్యుడీషియల్‌ రిమాండ్‌ గడువు శుక్రవారం ముగియడంతో ఆయన కోర్టు కు నేరుగా హాజరుకావాల్సి ఉంది. కానీ కోర్టు ప్రాంగణానికి భారీగా అభిమానులు రావొచ్చని అంచనా వేసిన పోలీసులు.. ఆయన్ను వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరుకావాలని సూచించారు. దీంతో ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జడ్జి నిర్మల జనవరి 10కి వాయిదా వేశారు. 

మరోవైపు  రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ నాంపల్లిలోని 2వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో ఆయన తరఫు న్యా యవాదులు నిరంజన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి శుక్ర­వారం పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే  విచారణ వాయిదా వేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రామకృష్ణ కోరడంతో అంగీకరించిన జడ్జి వినోద్‌కుమార్‌ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)