Breaking News

త్వరలో తొలిదశ సీట్ల కేటాయింపు

Published on Fri, 07/19/2024 - 04:45

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ తొలి దశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఆప్షన్లకు ఇచ్చిన గడువు ముగిసింది. 96 వేల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. వివిధ కాలేజీలు, బ్రాంచీలకు మొత్తం 62 లక్షల ఆప్షన్లు అందినట్టు అధికారు లు తెలిపారు. వాస్తవానికి ఆప్షన్ల గడు వు 15వ తేదీతో ముగిసింది.

 కొత్తగా 2,640 సీట్లు పెరగడంతో గడువును 18 వరకు పొడిగించారు. 19న సీట్ల కేటాయింపు చేపట్టాల్సి ఉంది. కానీ ఆప్షన్ల గడువు పొడిగించడంతో ఈ తేదీలో మార్పు చోటు చేసుకుంది. అందిన ఆప్షన్లపై సాంకేతిక విద్యా విభాగం కసరత్తు చేస్తోంది. ఒకటి రెండురోజుల్లో సీట్ల కేటాయింపు చేపట్టే వీలుందని సంబంధిత అధికారులు తెలిపారు. 

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో 11 వేల సీట్లను ప్రైవేటు కాలేజీలు రద్దు చేసుకున్నాయి. వీటి స్థానంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో సీట్లు పెంచాలని కోరాయి. కానీ ప్రభుత్వం దీనికి అనుమతించలేదు. ఈ సీట్లపై మొదటి కౌన్సెలింగ్‌ వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

75 శాతం సీఎస్‌ఈ ఆప్షన్లే
రాష్ట్రంలోని 173 కాలేజీలు ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 1,01,661 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్‌ కోటాలో తొలి విడత 72,741 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులోనే పెరిగిన 2,640 సీట్లు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఆప్షన్లలో 75 శాతం విద్యార్థులు మొదటి ప్రాధాన్యతగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులనే ఎంచుకున్నారు. 

ఎంసెట్‌లో వందలోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులంతా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు, టాప్‌ 5లో ఉన్న ప్రైవేటు కాలేజీలకు సీఎస్‌సీ, ఇతర కంప్యూటర్‌ బ్రాంచీలకే తొలి ప్రాధాన్యత ఇచ్చారు. జేఈఈ ద్వారా ‘నిట్‌’లో సీట్లు పొందిన వాళ్లు కూడా టాప్‌ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఇందులో 80 శాతం విద్యార్థులు సీట్లు వచ్చినా చేరే అవకాశం ఉండదు.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)