Breaking News

బాసర ట్రిపుల్‌ ఐటీలో 1,404 సీట్ల కేటాయింపు

Published on Thu, 07/04/2024 - 04:26

సాక్షి, హైదరాబాద్‌/బాసర/భైంసా: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (బాసర ట్రిపుల్‌ ఐటీ)లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో 1,404 సీట్లు కేటాయించారు. టెన్త్‌లో ఉత్తీర్ణులైన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఈ సీట్లు ఇస్తారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం బీఆర్‌ అంబేడ్కర్‌ సెక్రటేరియట్‌లో ఎంపికైన విద్యార్థుల జాబితాను, సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు. 

బాసర ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జి వైస్‌చాన్స్‌లర్‌ వెంకటరమణ, జాయింట్‌ కనీ్వనర్‌ పావని, దత్తు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీట్లు పొందిన వారిలో బాలికలే ఎక్కువ మంది ఉన్నారు. టెన్త్‌ మార్కుల్లో పొందిన ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగినట్లు అధికారులు తెలిపారు.         ఎంపికైన విద్యార్థుల జాబితాను  ఠీఠీఠీ.టజuజ్టు. ్చఛి.జీn వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 

8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్‌ 
ఈనెల 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని వీసీ వెంకటరమణ తెలిపారు. వరుస క్రమంలో 8వ తేదీన 1 నుంచి 500 వరకు, 9న 501 నుంచి 1000 వరకు, 10న 1,001 నుంచి 1,404 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు, స్పోర్ట్స్‌ కోటాలో విద్యార్థులను ఈనెల 4న ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 

బాసర ట్రిపుల్‌ఐటీలో 2024–25 విద్యా సంవత్సరానికి 976 మంది బాలికలు (69 శాతం), 428 మంది బాలురు (31 శాతం) ఎంపిక చేశారు. కాగా, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన 95 శాతం మంది విద్యార్థులు ట్రిపుల్‌ఐటీలో సీట్లు దక్కించుకున్నారు. ఈ విద్యాసంవత్సరంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 330 సీట్లు రాగా ట్రిపుల్‌ఐటీ ఉన్న నిర్మల్‌ జిల్లా విద్యార్థులు 72 సీట్లు దక్కించుకున్నారు.  

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)