Breaking News

తాగునీటి కోసం కృష్ణా జలాల కేటాయింపు

Published on Fri, 05/23/2025 - 04:34

సాక్షి, హైదరాబాద్‌/ నాగార్జునసాగర్‌: తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 10.26, ఆంధ్రప్రదేశ్‌కు 4 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ అతుల్‌ జైన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ కుడి కాలువ ద్వారా ఈనెల 22 నుంచి అంటే గురువారం నుంచే రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున 4 టీఎంసీలను విడుదల చేయాలని సాగర్‌ సీఈని ఆదేశించారు. 

శ్రీశైలం ప్రాజెక్టులో జూలై 31 నాటికి 800 అడుగుల స్థాయిలో నీరు నిల్వ ఉండేలా చూసి.. మిగతా నీటిని విడ్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు తరలించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి లభ్యతను సమీక్షించి.. కేటాయింపులపై బోర్డు చైర్మన్‌కు సిఫార్సు చేసేందుకు ఈనెల 5న హైదరాబాద్‌లో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్‌సీ హాజరుకాగా, ముందస్తు షెడ్యూలు వల్ల ఏపీ ఈఎన్‌సీ హాజరుకాలేదు. 

కాగా, రాష్ట్రంలో తాగునీటి అవసరాల కోసం 10.26 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ఈఎన్‌సీ త్రిసభ్య కమిటీ సమావేశంలో కోరారు. అలాగూ తాగునీటి అవసరాల కోసం పది టీఎంసీలు విడుదల చేయాలని ఈనెల 20న ఏపీ ఈఎన్‌సీ కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. శ్రీశైలంలో ఈనెల 5 నాటికి 800 అడుగులకు ఎగువన, సాగర్‌లో 510 అడుగులకు ఎగువన 10.81 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయని తెలంగాణ ఈఎన్‌సీ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. 

ఇదిలా ఉండగా రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలు తీర్చడానికి శ్రీశైలంలో 800 అడుగుల వరకూ.. సాగర్‌లో 505 అడుగుల స్థాయి వరకూ నీటిని వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. బుధవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగులకు ఎగువన 8.422, సాగర్‌లో 505 అడుగులకు ఎగువన 12.793.. వెరసి మొత్తం 21.215 టీఎంసీలు లభ్యతగా ఉన్నట్లు బోర్డు లెక్కగట్టింది. ఇందులో 4.243 టీఎంసీలు ఆవిరి, ప్రవాహ నష్టాలుపోనూ 16.972 టీఎంసీల్లో తెలంగాణకు 10.26, ఆంధ్రప్రదేశ్‌కు 4 టీఎంసీల చొప్పున బోర్డు కేటాయించింది. 

కాగా, కేఆర్‌ఎంబీ ఆదేశాలతో ప్రాజెక్టు అధికారులు సాగర్‌ కుడికాలువకు గురువారం 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున 8 రోజుల పాటు 4 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుడి కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకొని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని బోర్డు అధికారులు సూచించారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)