Breaking News

సింగరేణిపై హౌస్‌ కమిటీ వేయాలి

Published on Sat, 06/20/2026 - 01:27

శ్రీరాంపూర్‌: సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చడానికి హౌస్‌ కమిటీ వేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం శుక్రవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ గనుల్లోæ భరోసా యాత్ర నిర్వహించింది. ఎస్సార్పీ ఓసీపీ సందర్శనకు వెళ్లగా.. పోలీసులు అనుమతి లేదంటూ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రెండు గంటలపాటు రోడ్డుపైనే ఆపేశారు. అక్కడి నుంచి వెనుదిరిగి పీవీఆర్‌ గార్డెన్‌లో మీడియాతో మాట్లాడారు.

సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, దీనిపై విచారణ చేయాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జైపూర్‌ ఎస్టీపీపీలో ప్లాంటు ఏర్పాటు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, బాయిలర్‌ లీకేజీ వంటి ఘటనలతో సుమారు రూ.982 కోట్ల నష్టం జరిగిందన్నారు.తాడిచెర్ల బొగ్గు బ్లాకును కూడా నాటి ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉన్న ఏఎంఆర్‌ అనే సంస్థకు కట్టబెట్టి రూ.కోట్ల అవినీతికి పాల్పడిందని విమర్శించారు.

నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లు భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి ఈ అవినీతిని ప్రశ్నించారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. కంపెనీలో 36 ఓబీ సంస్థలకు ఎక్సెస్‌ టెండర్లతో పనులు కట్టబెట్టి రూ.23,486 కోట్ల నష్టం చేశారన్నారు. సైట్‌ విజిట్‌ పేరుతో రేవంత్‌రెడ్డి చుట్టానికి వీకేఓసీపీ ఓబీ పనులు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. బొగ్గు నిల్వల మాయంపై బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సింగరేణికి లేఖ రాస్తే దానికి సమాధానం ఇవ్వడం లేదని మండిపడ్డారు. 

పోలీసులతో వాగ్వాదం..
భరోసా యాత్ర సందర్భంగా పోలీసులు ఓసీపీ వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఎమ్మెల్యేలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము శాసనసభ్యులమని, తమను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఓసీపీ చెక్‌పోస్టు వద్దనే ఎమ్మెల్యేల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యేలను బలవంతంగా తీసుకువచ్చి వారి వాహనాల్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, నేతలకు మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, కె.వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీశ్‌బాబు, దన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)