Breaking News

బచావత్‌కు ‘బనకచర్ల’ విరుద్ధం!

Published on Fri, 07/11/2025 - 04:55

సాక్షి, హైదరాబాద్‌:  ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ఆమోదయోగ్యం కాదని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) కుండబద్దలు కొట్టింది. గోదావరి జలాల పంపిణీపై బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుతో పాటు పోలవరం ప్రాజెక్టుకు అనుమతిస్తూ 2011లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)లోని 108వ టెక్నికల్‌ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) జారీ చేసిన మార్గదర్శకాలకు ఈ ప్రాజెక్టు విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ మేరకు గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ప్రీ ఫీజబిలిటీ రిపోర్టుపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. గోదావరి బోర్డు తాజాగా సీడబ్ల్యూసీకి లేఖ రాసింది.  

జీఆర్‌ఎంబీ అభిప్రాయం కోరిన సీడబ్ల్యూసీ 
బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి రోజుకు 2 టీఎంసీలు చొప్పున మొత్తం 200 టీఎంసీల గోదావరి జలాలను క్రాస్‌ రెగ్యులేటర్‌కు తరలించి 3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 9.14 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రత్యామ్నాయ నీటి వసతి, 80 లక్షల మందికి తాగునీటి సదుపాయం కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు ప్రాజెక్టు ప్రీ ఫీజబిలిటీ రిపోర్టును సమర్పించింది. దానిని గత మే 23న గోదావరి బోర్డు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు పంపిన సీడబ్ల్యూసీ అభిప్రాయాలు కోరింది. ఈ నేపథ్యంలో గోదావరి బోర్డు తన అభిప్రాయాన్ని తెలియజేసింది.  

ప్రాజెక్టు విస్తరణ కుదరదన్న బోర్డు 
పోలవరం ప్రాజెక్టుకు అనుమతిస్తూ టీఏసీ జారీ చేసిన ఆపరేషన్స్‌ ప్రొటోకాల్స్‌ ప్రకారం ఆ ప్రాజెక్టు విస్తరణకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని జీఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పులోని 14(డీ) క్లాజు ప్రకారం గోదావరిలోని వరద జలాలపై అన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటుందని తెలిపింది. ఒక వేళ గోదావరి జలాలను మరో నది పరీవాహక ప్రాంతానికి తరలిస్తే ఆ జలాలపై పరీవాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలకూ వాటాలుంటాయని వివరించింది. 

పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా పరీవాహక ప్రాంతానికి 80 టీఎంసీల జలాలను తరలిస్తే దానికి బదులుగా నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలకు 80 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ బచావత్‌ ట్రిబ్యునల్‌ నిర్ణయం తీసుకుందని గుర్తు చేసింది. ఇదే సూత్రం బనకచర్ల ప్రాజెక్టుకు సైతం వర్తిస్తుందని స్పష్టం చేసింది. గోదావరిలో వరద, మిగులు జలాల లభ్యతపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలనే తరలిస్తామని ఏపీ ప్రతిపాదించినప్పటికీ వాస్తవంగా తరలించేది వరద జలాలా? మిగులు జలాలా? నికర జలాలా? అనే అంశంపై సైతం స్పష్టత లేదని తెలిపింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)