Breaking News

సహాయక చర్యలకు నీటి లీకేజీ అడ్డంకి..

Published on Mon, 02/24/2025 - 04:29

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, నాగర్‌కర్నూల్‌/అచ్చంపేట: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సహాయక చర్యలకు భారీగా వస్తున్న నీటి ఊట అడ్డంకిగా మారుతోందని తెలిపారు. ఆ నీటిని తొలగించడానికి ప్రయత్నిస్తూనే.. లోపలున్న వారికోసం నిరంతరం ఆక్సిజన్‌ను పంపింగ్‌ చేస్తున్నామని వివరించారు. ఉత్తమ్‌ ఆదివారం మంత్రి జూపల్లితో కలసి టన్నెల్‌ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘టన్నెల్‌లో నీటి ప్రవాహం పెరుగుతోంది.

రాతిపొరలు వదులై మట్టి కూలడంతో అక్కడి నుంచి కూడా నీరు వస్తుండటంతో అంతా బురదమయంగా మారింది. రెస్క్యూ ఆపరేషన్‌కు సవాలుగా మారుతోంది. చిక్కుకున్న వారిని రక్షించేందుకు సాంకేతిక నిపుణులు 24 గంటలపాటు ప్రయత్నిస్తున్నారు. భారీ యంత్రాలను టన్నెల్‌లోకి పంపి రక్షించే పరిస్థితి లేదు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉన్నారు. మట్టికుప్పలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలను సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ కూడా సీఎంతో మాట్లాడారు..’’అని ఉత్తమ్‌ తెలిపారు. 

ఘటనపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. 
ప్రమాదం విషయం తెలియగానే ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించిందని, ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని మంత్రి ఉత్తమ్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఈ ఘటనపై చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ ప్రాజెక్టుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని.. టన్నెల్‌ పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)