Breaking News

నాగార్జున పరువు నష్టం కేసు.. కోర్టుకు మంత్రి కొండా సురేఖ

Published on Thu, 02/13/2025 - 11:42

హైదరాబాద్‌, సాక్షి:  తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. గతంలో తన కుటుంబ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలకుగానూ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఇవాళ స్పెషల్ జడ్జి ముందు ఆమె హాజరై వివరణ ఇవ్వనున్నారు.

ఈ  పిటిషన్‌కు సంబంధించి ఇప్పటికే నాగార్జున కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం సేకరించింది కోర్టు. గత వాదనల్లో.. కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని నాగార్జున తరఫు న్యాయవాది అశోక్‌ రెడ్డి వాదించారు.

బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్‌ చర్యలకు అర్హురాలని వాదించారు. అయితే తన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణ చెప్పిన విషయాన్ని సురేఖ
తరఫు న్యాయవాది గురుప్రీత్‌ సింగ్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే మీడియా ముఖంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు, కోర్టుకు సమర్పించిన వివరాలకు పొంతన లేకుండా ఉందని అశోక్‌ రెడ్డి వాదించారు.

ఈ క్రమంలో ఇరువైపులా వాదనల అనంతరం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు పలుమార్లు మంత్రికి సమన్లు జారీ చేసింది. అయితే పలు ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఆమె వివరణ ఇస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవాళ ఆమె కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు.

నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరైన మంత్రికొండ సురేఖ

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)