Breaking News

సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ జయభేరి

Published on Thu, 12/28/2023 - 00:27

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ(All India Trade Union Congress) సత్తా చాటింది. మొత్తంగా 1436 ఓట్ల తేడాతో గుర్తింపు సంఘంగా ఎన్నిక కాబడింది. సింగరేణి విస్తరించిన ఉన్న 11 ప్రాంతాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులకుగానూ.. 37,447 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే.. అత్యధిక ఓట్లతో ఏఐటీయూసీతో గుర్తుకు కార్మికులు పట్టం కట్టారు. 

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో 5 స్థానాలలో ఐఎన్టీయూసీ, 6 స్థానాలలో ఏఐటీయూసీ విజయం సాధించాయి. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం–1, రామగుండం–2, రామగుండం–3 ప్రాంతాల్లో ఏఐటీయూసీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అత్యధిక ఓట్లతో ఆయా ప్రాంతాల్లో ప్రాతినిధ్యం దక్కించుకుంటూనే కార్మికుల ఓట్లను రాబట్టింది. ఒక్క శ్రీరాంపూర్‌లోనే 2,166 ఓట్ల ఆధిక్యం చేజిక్కించుకోవడం పోలింగ్‌లోనే టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది.


ఇక కాంగ్రెస్‌ అనుబంధ సంస్థ ఐఎన్‌టీయూసీ ఇల్లెందు, మణుగూరు, కార్పొరేట్‌లో ఏఐటీయూసీపై స్వల్ప ఆధిక్యంతో ప్రాతినిధ్యం నిలుపుకోగలిగింది. 2012, 2017లో సత్తా చాటిన బీఆర్‌ఎస్‌ అనుబంధ టీజీబీకేఎస్‌.. ఈసారి ఎన్నికల్లో ఖాతానే తెరవలేదు.

AITUC సాధించినవి

  • బెల్లంపల్లి - 122
  •  మందమర్రి - 467
  • శ్రీరాంపూర్ - 2166
  • రామగుండం-1 -451
  •  రామగుండం-2 - 358

మొత్తం ఓట్లు = 3564 మెజారిటీ 
 
INTUC

  • కార్పొరేషన్ -  342            
  • కొత్తగూడెం -    233 
  • మణుగూరు - 2
  • ఇల్లందు        - 46
  •  భూపాలపల్లి - 801
  •  రామగుండం-3 - 704

మొత్తం = 2128 మెజారిటీ.

మొత్తంగా
ఏఐటీయూసీ మెజారిటీ =3564
ఐఎన్‌టీయూసీ మెజారిటీ         =2129

రాష్ట్ర స్థాయి లో 1436 ఓట్ల తో AITUC గుర్తింపు సంఘం గా ఎన్నిక కాబడింది.


పోలింగ్‌ సరళి ఇలా...! 
సింగరేణి వ్యాప్తంగా 11ఏరియాల్లో ఏర్పాటు చేసిన 84 పోలింగ్‌ కేంద్రాల్లో 39,773మందికి 37,447 (94.15శాతం) మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం నుంచే కార్మికులు బారులుదీరారు. దీంతో గంటగంటకూ పోలింగ్‌ శాతం పెరిగింది. అన్ని ఏరియాల్లో కలిపి ఉదయం 8గంటల వరకు 14.62 శాతం  పోలింగ్‌ నమోదుకాగా, 9గంటలకు 27.05 శాతం , 10గంటలకు 38.67శాతం , 11గంటలకు 49.89శాతం , 12గంటలకు 59.33శాతం , మధ్యాహ్నం 1గంటకు 67.67శాతం  2గంటలకు 75.41శాతం , 3గంటల వరకు 85.92శాతం , 4గంటలకు 93.09 శాతం , పోలింగ్‌ ముగిసే సాయంత్రం 5గంటల వరకు మొత్తంగా 94.15 పోలింగ్‌ శాతంగా నమోదైంది. కౌంటింగ్‌ రాత్రి 7 గంటల నుంచి మొదలైంది. అయితే స్పష్టమైన ఫలితాల కోసం అర్ధరాత్రి దాటే దాకా ఎదురు చూడాల్సి వచ్చింది.


 
ఎవరు ‘ప్రాతినిధ్యం’... ఎవరు గుర్తింపు సంఘం 
సింగరేణివ్యాప్తంగా ఉన్న 11ఏరియాలు ఉండగా,  ఆయా ఏరియాల్లో అత్యధికంగా ఓట్లు సాధించిన యూనియన్‌ను ప్రాతినిధ్య సంఘంగా గుర్తిస్తారు. పదకొండు ఏరియాల్లోనూ అత్యధికంగా ఓట్లు లభించిన యూనియన్‌ను గుర్తింపు సంఘంగా ప్రకటిస్తారు. సింగరేణిలో ఏడోసారి నిర్వహించిన ఎన్నికల్లో 11 ఏరియాల్లో  4 చోట్ల ఐఎన్‌టీయూసీ   5 చోట్ల గెలిచి ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా  విజయం సాధించాయి. మొత్తంగా సింగరేణివ్యాప్తంగా అత్యధిక ఓట్లు సాధించి ఏఐటీయూసీ  సంఘం గుర్తింపు సంఘంగా విజయకేతనం ఎగురవేసింది. 
 
గత ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఇలా.. 
1998–ఏఐటీయూసీ 
2001–ఏఐటీయూసీ 
2003–ఐఎన్‌టీయూసీ 
2007–ఏఐటీయూసీ 
2012–టీజీబీకేఎస్‌ 
2017–టీజీబీకేఎస్‌ 
2023–ఏఐటీయూసీ    

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)