Breaking News

టాప్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్‌ సీట్ల పరిమితి ఎత్తివేత! 

Published on Sun, 12/10/2023 - 04:29

సాక్షి, హైదరాబాద్‌: అత్యుత్తమ ప్రతిభగల ఇంజనీరింగ్‌ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశానికి పరిమితి ఎత్తివేయబోతున్నారు. ఇందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీన్ని రాష్ట్రాల ఉన్నతవిద్యా మండళ్లకు పంపింది. వచ్చే ఏడాది (2024) నుంచి దీన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది.

బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (బీసీఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) కోర్సుల విషయంలోనూ ఈ విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించింది. ఇటీవల విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లోనూ ఏఐసీటీఈ దీన్ని ప్రస్తావించింది. ముసాయిదా ప్రతిని సమీక్షించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. యూనివర్సిటీల వీసీలు, మండలి ఉన్నతాధికారులు ఈ అంశంపై చర్చించేందుకు సమావేశమవుతున్నారు. 

రాష్ట్రంలో పది కాలేజీలకు అవకాశం.. 
రాష్ట్రంలో 174 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా అటానమస్‌ కాలేజీలను కలుపుకొని 100 కాలేజీలకు ‘న్యాక్‌’అక్రెడిటేషన్‌ ఉంది. వాటిల్లో అత్యుత్తమ ప్రమాణాలు కనబరిచే కాలేజీల జాబితాను గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం ఎక్స్‌పర్ట్‌ విజిటింగ్‌ కమిటీ (ఈవీసీ)ని మండలి నియమించాల్సి ఉంటుంది. ఇందులో ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీల సభ్యులు ఉంటారు.

విద్యార్థుల హాజరు శాతం, ఏటా కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీకి ఎందరు దరఖాస్తు చేస్తున్నారు? ఏయే కోర్సులను డిమాండ్‌ చేస్తున్నారు? ఆయా కోర్సుల్లో చేరేవారి పురోగతి ఎలా ఉంది? కాలేజీలో చేరిన విద్యార్థుల మార్కుల వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఉపాధి పొందిన తీరు, లభించిన వార్షిక వేతనం వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది.

ఇలా రాష్ట్రంలో అన్ని అర్హతలు ఉన్న కాలేజీలు 10 వరకూ ఉంటాయని మండలి వర్గాలు చెబుతున్నాయి. అయితే కంప్యూటర్‌ కోర్సులకు డిమాండ్‌ పెరిగాక సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా? అనే విషయమై ఏఐసీటీఈ స్పష్టత ఇవ్వలేదు. కాలేజీల్లో ఉండే మౌలికవసతులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పినా, దానిపైనా స్పష్టత ఇవ్వలేదని అధికారులు అంటున్నారు.  

సీట్లు పెరిగేనా? 
ప్రస్తుతం ప్రతి కాలేజీలోని ఒక్కో బ్రాంచిలో గరిష్టంగా 4 సెక్షన్లనే అనుమతిస్తున్నారు. ఒక్కో సెక్షన్‌లో 60 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లు ఉంటున్నాయి. అయితే నాలుగు సెక్షన్లు ఉన్న కాలేజీలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాటిల్లోనూ ఎక్కువగా సీఎస్‌ఈ, కొత్తగా వచి్చన కంప్యూటర్‌ కోర్సులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిమితి ఎత్తేసినా కొత్తగా సీట్లు పెరుగుతాయా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. కొత్త విధానం వల్ల యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు తీసుకోవాల్సిన అవసరం ఉండదని అధికారులు అంటున్నారు.  

విస్తృత చర్చ చేపడతాం.. 
ఏఐసీటీఈ ముసా యిదా ప్రతిపై త్వరలో ఉన్నతస్థాయి చర్చ చేపడతాం. ఏఐసీటీఈ ప్రతిపాదనలు రాష్ట్రంలో అమలు చేయగలమా లేదా? అనేది పరిశీలించాల్సి ఉంది. వీసీలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నాక దీనిపై ఏఐసీటీఈకి అభిప్రాయం తెలియజేస్తాం.    – ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌  

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)