79,40,520 ఎకరాల్లో యాసంగి సాగు

Published on Wed, 12/25/2024 - 03:56

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో యాసంగి సీజన్‌ సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. మొత్తం 79,40,520 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో ఒక్క వరి పంటే 63,54,288 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 47,27,000 కాగా, ఈసారి అదనంగా 15.86 లక్షల ఎకరాల్లో సాగవుతుందని లెక్కగట్టింది. 

వరి తరువాత మొక్కజొన్న 7,18,100 ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ పంట సాధారణ సాగు విస్తీర్ణం 5,89,098 ఎకరాలు కాగా.. ఈసారి అదనంగా 1.30 లక్షల ఎకరాల్లో సాగవుతుందని లెక్కలు వేశారు. స్వీట్‌కార్న్‌ (తీపి మొక్కజొన్న) కూడా 950 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు తెలిపారు. 

వీటి తరువాత స్థానంలో వేరుశనగ ఉంది. ఈ పంట సాధారణ సాగుకన్నా కొంచెం ఎక్కువగా 2,57,600 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. జొన్నలు 1,42,900 ఎకరాల్లో, మినుములు 49,250 ఎకరాల్లో, కుసుమలు 23,100 ఎకరాల్లో సాగు కానున్నట్లు ప్రతిపాదించారు.  

గత యాసంగి కన్నా అధికం..  
గత సంవత్సరం యాసంగితో పోలిస్తే ఈసారి దాదాపు 12 లక్షల ఎకరాలకుపైగా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 2023 యాసంగిలో 67,83,358 ఎకరాల్లో పంటలు వేయగా, అందులో వరి వాటా 55 లక్షల ఎకరాలు. మొక్కజొన్న, పప్పులు, చిరుధాన్యాలు, నూనె గింజలు తదితర అన్ని పంటలు కలిపి 12 లక్షల ఎకరాలకు పైగా సాగైనట్లు వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. 

గడిచిన వానాకాలం సీజన్‌లో సుమారు కోటి ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా, అందులో వరి ఒక్కటే 66.78 లక్షల ఎకరాల్లో వేశారు. వానాకాలం సాగుకు దాదాపు సమానంగా ఈసారి యాసంగిలో వరి సాగు ఉంటుందని వ్యవసాయ శాఖ చెబుతోంది.  

పెరిగిన సన్నాల సాగు.. 
వానాకాలం సీజన్‌లో సన్నాల సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. సన్న వడ్లకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్‌ప్రకటించడమే అందుకు కారణమని ప్రభుత్వం చెబుతోంది. 2023 వానాకాలం సీజన్‌లో కేవలం 25.05 లక్షల ఎకరాల్లో (మొత్తం సాగులో 38 శాతం) సన్న రకం వరి పండించారు. 

2024 వానాకాలం సీజన్‌లో ఏకంగా 40.55 లక్షల ఎకరాల్లో సన్న ధాన్యం వేశారు. ఈ నేపథ్యంలో యాసంగిలో కూడా సన్నాల సాగు గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. యాసంగిలో సాగుకు అనువైన వడ్ల రకాలను సీడ్‌ కార్పొరేషన్, ప్రైవేటు సీడ్‌ కంపెనీలు విడుదల చేయటంతో రైతులు ఎక్కువగా అటువైపే మొగ్గుచూపుతున్నారు.  

అందుబాటులో 30 లక్షల క్వింటాళ్ల విత్తనాలు  
యాసంగి సాగు కోసం 18,10,438 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, 30,11,119 క్వింటాళ్లు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. ఇందులో సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 52,850 క్వింటాళ్లు, ఎన్‌ఎస్‌సీ 27,308 క్వింటాళ్లు, ప్రైవేటు సంస్థలు 29,30,962 క్వింటాళ్లు అందుబాటులో ఉంచాయి. 

అలాగే యాసంగి సీజన్‌కు 19.60 లక్షల మెట్రిక్‌ టన్నుల డీఏపీ, యూరియా, ఎన్‌పీకే, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ ఎరువులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)