Breaking News

ఫింగర్‌ ప్రింట్స్‌ కోసం సీఐడీకి అధునాతన కిట్లు

Published on Thu, 04/27/2023 - 03:34

సాక్షి, హైదరాబాద్‌: నేరాలు జరిగినప్పుడు వాటిని ఛేదించేందుకు ఫింగర్‌ ప్రింట్స్‌ కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరణ, తరు­వాత వాటిని విశ్లేషించడానికి అవసరమైన అధునాతన కిట్స్‌ను రాష్ట్ర సీఐడీ విభాగం సమకూర్చుకుంది. రూ.1.33 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఫింగర్‌ ప్రింట్‌ కిట్స్‌ను సీఐడీ అడిషనల్‌ డీజీపీ మహేశ్‌ భగవత్‌ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆరు జోన్లలోని అధికారులకు అందజేశారు.  

ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లోని ఎల్‌బీ నగర్‌ జోన్, సైబరాబాద్‌లోని శంషాబాద్‌ జోన్, హైదరాబాద్‌ నగరంలోని సౌత్, నార్త్, వెస్ట్, సెంట్రల్‌ జోన్‌­లకు ఈ కిట్లను అందించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ఫింగర్‌ ప్రింట్‌ యూనిట్లకు వీటిని అందచేయనున్నట్లు మహే ష్భగవత్‌ చెప్పారు. సీఐడీలోని ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో డైరెక్టర్‌ తాతా రావు మాట్లాడుతూ ఒక్కో కిట్‌లో మొత్తం తొమ్మిది రకాల వస్తువులు ఉంటాయని తెలిపారు.

మాస్టర్‌ ఎక్స్‌పర్ట్‌ లేటంట్‌ ప్రింట్‌ కిట్, ఫింగర్‌ ప్రింట్‌ కెమికల్‌ ప్రాసెసింగ్‌ కిట్, లెటంట్‌ బ్రషెస్, మాగ్నటిక్‌ పౌడర్‌ అప్లికేటర్, పోస్టు మార్టమ్‌ ఇంక్‌ టూల్, ఇంక్డ్‌ స్ట్రిప్స్, మాగ్నటిక్‌ పౌడర్స్, లెటెంట్‌ ప్రింట్‌ బేసిక్‌ పౌడర్స్, పోర్టబుల్‌ మల్టీబాండ్‌ లైట్‌సోర్స్‌ ఉంటాయి. కార్యక్రమంలో సీఐడీ అధికారులు ఎం.­నారాయణ(అడ్మిన్‌), ఆర్‌ వెంకటేశ్వర్లు(ఎస్‌సీఆర్‌బీ) రవీందర్‌(నార్కొటిక్స్‌), డీఎస్పీ నందుకుమార్‌(ఎఫ్‌పీబీ) పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)