Breaking News

గ్లోబల్‌ వేదికగా ‘ఏడీపీ ఇండియా’ వృద్ధి

Published on Mon, 09/09/2024 - 10:16

సాక్షి, సిటీబ్యూరో: హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో ‘ఏడీపీ ఇండియా’ వినూత్న ఆవిష్కరణలతో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ అగ్రస్థానంలో కొనసాగుతోందని ఏడీపీ గ్లోబల్‌ ప్రెసిడెంట్, సీఈఓ మరియా బ్లాక్‌ తెలిపారు. హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్, సరీ్వసెస్‌లో ప్రసిద్ధి చెందిన ఏడీపీ ఇండియా 25వ వార్షికోత్సవాలను ఆదివారం నిర్వహించింది. నగరంలోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్‌ శ్రీని కుటం, సీఎఫ్‌ఓ డాన్‌ మెక్‌గ్యురే, చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ పాల్‌ బోలాండ్‌తో పాటు దాదాపు 5 వేల మంది ఏడీపీ అసోసియేట్లు పాల్గొన్నారు.

102 మంది అసోసియేట్‌లతో కార్యకలాపాలను ప్రారంభించి 25 ఏళ్లలో 12 వేల మందికి పెరగడం విశేషమని మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయ్‌ వేములపల్లి అన్నారు. 25 శాతం సరీ్వస్‌ ఆర్గనైజేషన్, 34 శాతం సాంకేతిక బృందాలు ఉన్నాయని, ప్రపంచ మార్కెట్‌లో కంపెనీ శక్తివంతమైన పనితీరుకు ఇది నిదర్శనమన్నారు. నూతన ఆవిష్కరణలతో క్లైంట్‌ సేవలను అందించే కేంద్రంగా సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తుందని  సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుజ్ఞాన్‌ వెంకటేష్‌ అన్నారు. ఏడీపీ ఇండియా సీఎస్‌ఆర్‌ ప్రోగ్రాం–తరంగ్, స్టూడియో, డ్యాన్సింగ్‌ స్టార్స్, ధోల్‌ అసోసియేట్‌ల సాంస్కృతిక ప్రదర్శనలు  విశేషంగా ఆకట్టుకున్నాయి.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)